Share News

Handwriting Tips: పిల్లల చేతిరాత అందంగా మారేందుకు పేరెంట్స్ చేయాల్సిందిదే..

ABN , Publish Date - May 17 , 2025 | 06:17 PM

Tips To Improve Handwriting: నేటితరం పిల్లలు నిత్యం ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఎక్కువ సమయం రాసేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల చాలామందిలో హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. ఏకాగ్రత తగ్గి చదువులోనూ వెనకబడిపోతున్నారు. కనుక, పిల్లలు చూడముచ్చటగా చక్కగా రాయాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనులివే.

Handwriting Tips: పిల్లల చేతిరాత అందంగా మారేందుకు పేరెంట్స్ చేయాల్సిందిదే..
Parents Guide To Child For Handwriting

Parents Guide To Child For Handwriting: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో హ్యాండ్ రైటింగ్ కోసం అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటే పొరపాటే. పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం, మెమొరీ పవర్, ఆత్మవిశ్వాసం పెరగాలంటే కచ్చితంగా చేతిరాతపై దృష్టిపెట్టాల్సిందే. ఎందుకంటే అందంగా, వేగంగా రాసే పిల్లలే ఏ విషయాన్ని అయినా ఇట్టే అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ మీ పిల్లలు నెమ్మదిగా రాస్తున్నా, రాసేందుకు ఇబ్బంది పడుతున్నా, ఎక్కువగా తప్పులు రాస్తున్నా అది వారి మార్కులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి, పేరెంట్స్ పిల్లలకు ఈ టెక్నిక్స్ పిల్లలకు అలవాటు చేయాలి. ఆడుతూ పాడుతూనే ముత్యాల్లా రాయడం నేర్చేసుకుంటారు.


సిట్టింగ్

పిల్లల చేతిరాత మెరుగుపడేందుకు పేరెంట్స్ ఇలా చేయాలి. కుర్చీలో కూర్చుని టేబుల్‌పై పుస్తకం పెట్టుకునే రాసుకునేలా అలవాటు చేసుకోమని చెప్పండి. సరైన పొజిషన్ లో కూర్చోకపోతే పిల్లల చేతులపై ఒత్తిడి పడుతుంది. రాతపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. కాబట్టి, ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.


పెన్సిళ్లు, కాగితం ఇవ్వండి

పిల్లలకు పెన్సిల్, కాగితం ఇవ్వండి. వారు కోరుకునే ఆకారాలు, వృత్తాలు, బొమ్మలు ఏదైనా క్రియేట్ చేసే స్వేచ్ఛ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెన్ను లేదా పెన్సిల్ పట్టుకోవడంలో పట్టు సాధిస్తారు. వీలైతే పేరెంట్స్ పిల్లల చేతిని పట్టుకుని పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోవడం నేర్పాలి. ఏదైనా డ్రాయింగ్ పై దిద్దిస్తే మరీ మంచిది.


కాగితంపై వృత్తాలు

ఈ టెక్నిక్ పాటిస్తే పిల్లల చేతిరాత మెరుగుపడుతుందని కాలిగ్రఫీ నిపుణులు అంటున్నారు. ముందుగా కాగితంపై ఒక పెద్ద దీర్ఘచతురస్రాకారాన్ని గీయండి. తర్వాత అందులో త్రిభుజాకారం కనిపించే విధంగా మధ్య నుంచి విభజించండి. ఇప్పుడు పిల్లవాడిని ఈ రెండు రేఖల మధ్య ఒకేసారి అనేక సర్కిల్స్ గీయమని చెప్పండి. ఇది చాలా సరదాగా ఉంటుంది. జాగ్రత్తగా చేస్తే పిల్లల చేతిరాత మెరుగుపడుతుంది.


టేబుల్ గేమ్స్

పిల్లలకు మేజ్ కేమ్స్ ఆడే అవకాశం కల్పించండి. ఈ అలవాటు పెన్ను లేదా పెన్సిల్ సరిగ్గా పట్టుకోగలగేలా సహాయపడుతుంది. అలాగే పిల్లలకు వారి చేతులు, కళ్ళు రెండింటి పైనా నియంత్రణ ఉంటుంది. వారి దృష్టి సామర్థ్యం, లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి.


సరదాగా రాయండి

చిన్న పిల్లలకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగానే పిల్లలకు ఎక్కడపడితే అక్కడ నచ్చిన విధంగా గీసే అలవాటు ఉంటుంది. ఇలాంటప్పుడు పేరెంట్స్ కోప్పడకుండా రాయడానికి అనుమతించాలి. లేదంటే గోడలకు ఇసుక ట్రేలు, బ్లాక్‌బోర్డులను ఇంట్లోనే ఏర్పాటు చేయండి. వీటిపై చిన్న, పెద్ద అక్షరాలు రాసేలా ప్రోత్సహించండి. తద్వారా పిల్లల చేతిరాతను మెరుగుపరచడం సులభం అవుతుంది.


Read Also: Curd Beauty Benefits: ముఖానికి పెరుగు రాయడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు..

Hair Tips: రంగు వేసిన తర్వాత కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. ఈ తప్పులు చేయకండి..

Success Mantras: మీ జీవితాన్ని మార్చే 5 పవర్‌ఫుల్ అలవాట్లు..

Updated Date - May 17 , 2025 | 06:51 PM