Summer Tips: ఎండలో తిరిగి ఇంటికి రాగానే.. ఈ 4 పొరపాట్లు చేయకండి..
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:03 PM
Heat Wave Safety Tips: వేసవి కాలంలో ప్రజలు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. మనం అనుసరించే కొన్ని అలవాట్లు అనారోగ్యానికి కారణమవుతాయి. ఎక్కువ మంది పట్టించుకోకుండా వదిలేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

Post Sun Exposure Precautions: రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోనున్నాయి. ఇప్పటికే ప్రజలు మండే ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం ముగిసే వరకూ ప్రతిరోజూ మాటిమాటికీ గొంతు ఎండిపోవడం, శరీర వేడి పెరగడం అందరినీ బాధించే సమస్యే. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మండే ఎండల్లో తిరిగి ఇళ్లకు చేరుకోగానే చాలామంది ప్రజలు తరచూ చేసే పొరపాట్లు ఇవే. ఉపశమనం పొందడం కోసం ఈ పనులు అపాయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం పడేలా చేస్తాయి. కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసుకోండి.
ఫ్రిజ్ నీళ్లు
ఎండలో నుంచి ఇంటికి రాగానే నూటికి తొంభై మంది చేసే పని రిఫ్రిజిరేటర్ దగ్గరకు వెళ్లి చల్లటి నీరు తాగడం. ఇలా చేయడం వల్ల వేడెక్కిన శరీరానికి ఒకేసారి చలి ఆవరించిన అనుభూతి కలుగుతుంది. ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం ఆరోగ్యానికి అంత మంచి కాదు. కాబట్టి, ఇంటికి వచ్చిన తర్వాత శరీర ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు సమానంగా మారే వరకు వేచి ఉండండి. అలాగే ఎండలోంచి వచ్చిన తర్వాత చల్లటి నీటికి బదులుగా సాధారణ నీటిని తాగండి.
AC గాలి
మండే ఎండల్లో తిరిగి తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకోగానే ఉపశమనం పొందడానికి వెంటనే ఏసీ ఆన్ చేస్తారు చాలామంది. మీరు ఈ తప్పు చేయకండి. AC లోని చల్లని గాలి మీకు హాయిగా అనిపిస్తుంది కానీ అది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. మధ్యాహ్నపు ఎండల్లో నుంచి ఇంటికి వచ్చాక శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చేవరకూ ఉండండి. ఆ తర్వాతే ఏసీ గాలికి కూర్చోండి.
స్నానం
సమ్మర్ లో ఎండ, వేడి కారణంగా విపరీతంగా చెమటలు పడతాయి. ఆ చికాకును వదిలించుకోవడానికి చాలామంది ఇంటికి చేరుకున్న వెంటనే స్నానం చేయడానికి బాత్రూంకు వెళతారు. ఈ అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. , సూర్యకాంతి లేదా వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.అలాంటి స్థితిలో చల్లటి నీరు తగలగానే శరీర ఉష్ణోగ్రత క్షీణిస్తుంది. ఇలా చేయడం వల్ల జలుబు రావచ్చు.
తినడం
ఎండలో తిరగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ కారణంగా ఆకలిగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఇంటికి చేరుకున్న వెంటనే ఏదో ఒకటి తినడం ప్రారంభిస్తారు. మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే ఈ అలవాటును మార్చుకోవాలి. భగభగమండే ఎండలో నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే రిఫ్రిజిరేటర్ నుంచి ఏ చల్లటి పదార్థాన్ని తీసి తినకండి.
Read Also: Favorite Color: కలర్ సైకాలజీ తెలుసా.. ఫేవరెట్ కలర్ బట్టి వ్యక్తిత్వం కనుక్కోవచ్చు..
Sleeping Tips: రాత్రి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలా.. చీకట్లో నిద్రపోతే మంచిదా..
Oxygen Plants: ఈ 6 మొక్కలు ఇంట్లో నాటితే ఆరోగ్యం, ఐశ్వర్యం..