Share News

Pimples Tips: రాత్రిపూట ఈ పేస్ట్ రాస్తే పింపుల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయ్..

ABN , Publish Date - Jul 14 , 2025 | 07:57 PM

యువతీయువకుల్లో మొటిమల సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. కొంతమందికి పర్మనెంట్ సమస్యలా పట్టి పీడిస్తున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ ప్లేస్‌లో ఎక్కువగా మొటిమల సమస్య ఉంటే రాత్రిపూట ఈ పేస్ట్ అప్లై చేస్తే చాలు. ఈజీగా మీ సమస్య తీరిపోతుంది.

Pimples Tips: రాత్రిపూట ఈ పేస్ట్ రాస్తే పింపుల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయ్..
Forehead Acne Relief Tips

Forehead Pimple Treatment: ముఖం మీద మొటిమలు వస్తే ఎవరికి మాత్రం నచ్చుతుంది. ఇవి ముఖ అందాన్ని తగ్గించడంతో పాటు చికాకునూ కలిగిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ముఖం శుభ్రంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, జీవనశైలి, పోషకాహార లోపం, కాలుష్యం, దుమ్ముధూళి, హార్మోన్ల అసమతుల్యత మొదలైన సమస్యల కారణంగా ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు వస్తుంటాయి. ఇంక కొంతమందిలో నుదుటిపై మొటిమలు ఎక్కువగా ఉంటాయి. వీటిని పట్టించుకోకపోతే సమస్య తీవ్రమవుతుంది. అలా అని రసాయన ఉత్పత్తులను ఉపయోగించినా నష్టమే. కాబట్టి, నిపుణులు సూచించిన సహజ పద్ధతులను అనుసరించి మీ సమస్యకు టాటా చెప్పేయండి.


దాల్చిన చెక్క

వంటలకు ప్రత్యేకమైన రుచిని, ఘాటైన సువాసనను ఇచ్చే దాల్చిన చెక్క చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. ముందుగా మీరు దాల్చిన చెక్కను పొడిగా చేసుకుని దాన్ని కొంత తేనెతో కలపండి. ఈ పేస్ట్‌ను మీ నుదుటిపై ఉన్న మొటిమలపై రాసుకోండి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఈ చిట్కా ఫాలో అవండి. కొన్ని రోజుల్లోనే మొటిమలు తగ్గిపోయి సహజమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుతారు.

కలబంద

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద మొక్క ఉండే ఉంటుంది. అందం, ఆరోగ్యం విషయంలో ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ పోషకాలు సమృద్ధిగా ఉండే కలబంద జెల్‌ను చర్మానికి పూసుకుంటే మృదువుగా మారుతుంది. ముఖ్యంగా మొటిమల సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ను రాసుకోవాలి. కొంత సమయం కాగానే నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. రోజూ ఇలా చేయడం వల్ల పింపుల్స్ తొలగిపోతాయి.


గ్రీన్ టీ టోనర్

మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోవాలంటే రాత్రి పడుకునే ముందు టోనర్ అప్లై చేయడం ఉత్తమం. మీరు గ్రీన్ టీని ఉపయోగించి ఇంట్లోనే సహజ టోనర్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం గ్రీన్ టీ పౌడర్ తీసుకొని కొద్దిగా రోజ్ వాటర్ తో కలిపి స్ప్రే బాటిల్ లో నిల్వ చేయండి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే తప్పకుండా మంచి ఫలితాలను కనిపిస్తాయి.

పుదీనా, రోజ్ వాటర్

ముఖం మీద మొటిమలను నయం చేసుకోవడానికి పుదీనాను కూడా ఉపయోగించవచ్చు. ముందుగా10 నుండి 12 పుదీనా ఆకులను తీసుకోండి. వాటిని చూర్ణం చేసి కొద్దిగా రోజ్ వాటర్ తో కలపండి. ఈ పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు మాయమవుతాయి.


చేయకూడనివి

నుదుటిపై లేదా ముఖంపై మొటిమలను స్క్రబ్ లేదా పాప్ చేయవద్దు. అలా చేయడం వల్ల మొటిమలు మరింత తీవ్రమవుతాయి. కేవలం పైన పేర్కొన్న సహజ పద్ధతులను మాత్రమే అనుసరించండి. అప్పుడే పింపుల్స్ నుంచి విముక్తి లభిస్తుంది.


Also Read:

ఆపరేషన్ అవసరం లేదు.. ఈ 7 ఆయుర్వేద పానీయాలతో కిడ్నీలో రాళ్లకు చెక్..

రోజూ ఈ 3 సూపర్ ఫ్రూట్స్ తింటే.. రోగాలు పరార్..!

For More Health News

Updated Date - Jul 14 , 2025 | 07:58 PM