Share News

Jamun Fruits: నేరేడు పండ్లు తినేటప్పుడు ఈ ఆహార పదార్థాలు తింటే.. ఆరోగ్యానికి ముప్పు!

ABN , Publish Date - Jul 20 , 2025 | 10:04 AM

నేరేడు పండ్లతో ఈ ఆహార పదార్థాలను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో కలిపి తింటే దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, నేరడు పండ్లతో వేటిని కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Jamun Fruits: నేరేడు పండ్లు తినేటప్పుడు ఈ ఆహార పదార్థాలు తింటే.. ఆరోగ్యానికి ముప్పు!
Jamun Fruits

ఇంటర్నెట్ డెస్క్‌: నేరేడు పండ్లను జామున్ లేదా జంబుల్ అని కూడా పిలుస్తారు. ఇవి భారతదేశంలో ఎక్కువగా లభించే ఒక కాలానుగుణ పండు. ఇవి తీపి, పుల్లని, కొద్దిగా వగరుగా ఉండే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. నేరేడు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే, నేరడు పండ్లతో ఈ ఆహార పదార్థాలను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో కలిపి తింటే దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, నేరడు పండ్లతో వేటిని కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


పాలు

కొంతమంది నేరడు పండ్లని పాలలో కలిపి షేక్ లాగా తాగుతారు. కానీ ఈ కలయిక ఆరోగ్యానికి హానికరం. నేరడు పండ్లతో పాలు తాగడం లేదా తిన్న తర్వాత తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ కలయిక జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీని కారణంగా మీకు గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగవచ్చు.

ఊరగాయ

నేరడు పండ్లతో పాటు ఊరగాయ అస్సలు తినకూడదు. ఇలా తినడం చాలా హానికరం. ఇది కడుపులో ఆమ్లం పెరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాంతులు, తల తిరగడం, కడుపు సమస్యలు రావచ్చు. కాబట్టి మీరు నేరడు పండ్లు తింటుంటే, తిన్న తర్వాత ఒక గంట పాటు ఊరగాయలు తినకండి.


పసుపు

నేరడు పండ్లు తిన్న తర్వాత, పసుపు కలిపిన ఆహారాలకు దూరంగా ఉండండి. కనీసం ఒక గంట పాటు పసుపు ఉపయోగించిన ఏదీ తినవద్దు. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో నొప్పి, మంట కలుగుతుంది. ఇది మలబద్ధకం, ఆమ్లత్వాన్ని కూడా కలిగిస్తుంది.

నీరు

కొంతమంది నేరడు పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతారు. కానీ, ఇలా తాగడం వల్ల విరేచనాలు లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, నేరడు పండ్లు తిన్న తర్వాత దాదాపు 30 నుండి 40 నిమిషాల వరకు నీరు తాగకూడదు.

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, నేరడు పండ్లు తినేటప్పుడు కొన్ని వాటికి దూరంగా ఉండటం ముఖ్యం. పాలు, పెరుగు, ఊరగాయ, పసుపు లేదా నీటితో కలిపి తినవద్దు. అలాగే, నేరడు పండ్లు తిన్న తర్వాత దాదాపు గంటవరకు వీటికి దూరంగా ఉండాలి.


Also Read:

పప్పులోని పోషకాలు అందాలంటే.. తప్పనిసరిగా ఇలా చేయండి.!

బియ్యం కడగకుండా వండితే ఏమవుతుందో తెలుసా?

Updated Date - Jul 20 , 2025 | 11:32 AM