Food Hacks: కిచెన్‌లో ఒక్క రోజులో పాడయ్యే ఆహార పదార్థాలు.. జాగ్రత్త తీసుకోకపోతే అంతేసంగతి..
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:54 PM
Quickly Spoiled Foods in Kitchen: చేతికి అందుబాటులో ఉంటాయని వంటగదిలో రకరకాల ఆహారపదార్థాలు ఉంచుతాం. అన్ని పదార్థాలు ఎక్కువ రోజుల పాడవకుండా తాజాగా ఉండవని మనకి తెలుసు. కానీ, అందరూ రోజూ వాడే ఈ పదార్థాలు కిచెన్‌లో పెట్టిన ఒక్క రోజులోనే కుళ్లిపోతాయి. ఇది తెలియక రోజుల తరబడి వాడేస్తే చేజేతులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నట్లే అవుతుంది.

Fastest Spoiling foods In Kitchen: ప్రతి ఆహారపదార్థం నిర్దిష్ట కాలం వరకూ మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ సమయం దాటిపోగానే చెడిపోతుంది. కొన్ని పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటే.. మరికొన్ని త్వరగా చెడిపోతాయి. కానీ, ఈ రోజు మనం చాలా తక్కువ సమయం నిల్వ ఉండే కొన్ని ఆహార పదార్థాల జాబితా గురించి తెలుసుకుందాం. ఇందులో ఏవి కూడా ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండవు. వేగంగా పాడైపోయి కుళ్లు వాసన వస్తాయి. వీటిని దాదాపు ప్రతి ఒక్కరూ వంటగదిలోనే నిల్వచేస్తారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ ఆహారపదార్థాలు కిచెన్‌లో ఉంచిన మొదటిరోజు నుంచే చెడిపోవడం ప్రారంభిస్తాయి. అందుకే అవేంటో తెలుసుకుని వీలైనంత త్వరగా ఈ పండ్లు లేదా కూరగాయలను ఉపయోగించడానికి ప్రయత్నించండి.లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
అరటిపండ్లు
అరటిపండు చాలా త్వరగా చెడిపోయే పండు. వీటిని రిఫ్రిజిరేటర్‌లో కూడా నిల్వ చేయలేము. చేయకూడదు. అందుకే ఫ్రిజ్ బయటే ఉంచాలి. వంటగదిలో రిఫ్రిజిరేటర్ బయట ఉంచినప్పుడు అది 24 సమయం గడవక ముందే చెడిపోవడం మొదలవుతుంది. అసలు నిజం ఏంటంటే, పండిన అరటిపండ్ల నుంచి ఇథిలీన్ వాయువు విడుదలవుతుంది. ఈ కారణంగానే అవి త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి అరటిపండ్లను ఇంట్లో నిల్వ ఉంచే బదులు వీలైనంత త్వరగా తినేయడం మంచిది.
టమోటాలు
టమోటా సాధారణంగానే జ్యూసీగా ఉండే కూరగాయ. ఇక పండిన టమోటాలను వంటగదిలోని వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఉంచితే అవి చాలా త్వరగా కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. పచ్చి టమోటాలను వంటగది ఉష్ణోగ్రత వద్ద 2 నుండి 3 రోజులు నిల్వ చేయగలిగినా.. పండిన టమోటాలు ఒక రోజులోనే చెడిపోవడం ప్రారంభిస్తాయి.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు కూడా చాలా త్వరగా చెడిపోతాయి. వీటిని రిఫ్రిజిరేటర్‌లో మూడు నుంచి నాలుగు రోజులు నిల్వ చేయడం సాధ్యమే అయినా.. వంటగదిలో మాత్రం అస్సలు పెట్టవద్దు. మార్కెట్ నుంచి పుట్టగొడుగులను తెచ్చిన వెంటనే అదే రోజే వండుకుని తినడం మంచిది.
బ్రెడ్
బ్రెడ్‌ను వంటగదిలో ఉంచితే చాలా త్వరగా పాడైపోతుంది. దీని గురించి తెలియక అందరూ తరచుగా రోజుల తరబడి ఓపెన్ చేసిన బ్రెడ్ ప్యాకెట్ ఉంచుతారు. ఆకలేసినప్పుడల్లా ఒకటి లేదా రెండు ముక్కలు తినేస్తూ మిగిలిన వాటిని మరుసటి రోజు కోసం నిల్వ చేసుకుంటారు. కానీ, వంటగదిలో బ్రెడ్‌ను ఎప్పుడూ ఇలా నిల్వ చేయకూడదు. వంటగదిలో ఉష్ణోగ్రత వల్ల బ్రెడ్ త్వరగా చెడిపోతుంది.
Read Also: Milk Storage Tips: వేసవిలో ఫ్రిజ్ లేకున్నా పాలు చెడిపోకుండా ఉండేందుకు.. అద్భుతమైన టిప్స్..
Water Bottle Car: కారులో వాటర్ బాటిల్ ఉంచుతున్నారా.. అవి తాగితే ఏమవుతుందో తెలిస్తే..
Heavy Nails: పెద్ద పెద్ద గోళ్లు పెంచుతున్నారా కేసులు పెడతారు