Share News

Trump-Musk: ట్రంప్.. ఎలాన్ మస్క్‌ని అంత మాటనేశాడేంటి..

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:28 PM

ప్రపంచంలోనే ఇద్దరు దమ్మున్న బిలియనీర్లు.. వీరి మధ్య బంధానికి బ్రొమాన్స్ అని పేరు. అయితే, ఇప్పుడు ఆ స్నేహానికి పూర్తిగా బీటలు వారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహానికి కాలం చెల్లుతోంది.

Trump-Musk: ట్రంప్.. ఎలాన్ మస్క్‌ని అంత మాటనేశాడేంటి..
Trump-Musk

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే ఇద్దరు దమ్మున్న బిలియనీర్లు.. వీరి మధ్య బంధానికి బ్రొమాన్స్ అని పేరు. అయితే, ఇప్పుడు ఆ స్నేహానికి పూర్తిగా బీటలు వారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మధ్య స్నేహానికి కాలం చెల్లుతోంది. అమెరికాలో తాజాగా జరుగుతున్న పరిణామాలు దీనిని సుస్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు వారిద్దరు బహిరంగంగా మాటల యుద్దానికి దిగుతున్నారు.

శుక్రవారం ABC న్యూస్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్‌తో వివాదం గురించి ప్రస్తావించినప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆ అంశంపై మాట్లాడదలుచుకోలేదని చెబుతూనే, ఆ మతిస్థిమితం లేని వ్యక్తితో నాకు మాటలేంటీ.. అనేశారు ట్రంప్.

మనస్పర్దలకు కారణమేంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఎంతగానో కృషి చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్. దీంతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ట్రంప్.. తన పాలకవర్గంలో కీలక బాధ్యతలను ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ చీఫ్‌గా నియమించి ప్రత్యేక అధికారాలు కూడా కల్పించారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు మస్క్ ఎంతగానో ప్రయత్నించి సఫలమయ్యారు కూడా. ఈ క్రమంలో ఎన్నో అపవాదులు కూడా మూటగట్టుకున్నారు మస్క్.

అయితే, డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక కొత్త బిల్లు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా కోతపడుతుంది. రాయితీలతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుందని, ఇది తాను చేసిన కృషినంతా నీరుగారుస్తుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్‌ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్‌ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మాటలు ట్రంప్ కు ఏ మాత్రం రుచించలేదు. ఇలా వీరిద్ధిరి మధ్య మొదలైన వివాదం కాస్తా పెద్ద గాలి వానలా మారుతోంది. ఈ క్రమంలో ఎలోన్ మస్క్ సంస్థ అయిన టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా $150 బిలియన్లకు పైగా టెస్లా తన విలువను కోల్పోయింది.


వీరిద్ధరి మధ్య పెరుగుతున్న విభేదాల్ని శాంతింపజేయడానికి ఫోన్ కాల్ ఏర్పాటు చేయబడుతుందనే చర్చలు వాషింగ్టన్ డిసిలో వినిపించాయి. కానీ అది జరగలేదు. శుక్రవారం ఉదయం (వాషింగ్టన్ సమయం) అమెరికా అధ్యక్షుడు, ఎలోన్ మస్క్ మధ్య డొనాల్డ్ ట్రంప్ సహాయకులు కాల్ షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వైట్ హౌస్ అధికారి, అమెరికన్ ప్రెస్ కు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే టైం చెప్పలేదు.

కొద్దిసేపటి తర్వాత, మరొక వైట్ హౌస్ అధికారి మరో అప్‌డేట్ ఇచ్చారు. 'అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఎలోన్ మస్క్‌తో కాల్ చేసే షెడ్యూల్ లేదు' అని చెప్పారు. ఇంతలో, అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ ABC న్యూస్ తెల్లవారుజామున ఫోన్ కాల్ ద్వారా అమెరికా అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేస్తోంది. కాల్ సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ను మస్క్‌తో కాల్ షెడ్యూల్ చేసినట్లు వచ్చిన వార్తల గురించి అడిగారు. కానీ ట్రంప్ ఆ మాటల్ని వ్యంగ్యంగా ఖండించారు. మైండ్ లేని వ్యక్తితో మాటలేంటని ట్రంప్ బహిరంగంగా ఎలాన్ మస్క్ మీద వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు అమెరికాతోపాటు, యావత్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 06 , 2025 | 10:28 PM