Share News

US Warns: నిబంధనలు పాటించకుంటే వీసా రద్దు

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:06 AM

అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను వీసాదారులు ఉల్లంఘిస్తే వారిని అగ్రరాజ్యం నుంచి పంపించి వేయనున్నట్టు శనివారం భారత్‌లోని...

US Warns: నిబంధనలు పాటించకుంటే వీసా రద్దు

న్యూఢిల్లీ, జూలై 12: అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను వీసాదారులు ఉల్లంఘిస్తే వారిని అగ్రరాజ్యం నుంచి పంపించి వేయనున్నట్టు శనివారం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. వీసా జారీ చేసినా యూఎస్‌ వీసా స్ర్కీనింగ్‌ ముగిసిపోదని, అన్ని అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను వీసాదారులు పాటిస్తున్నదీ లేనిదీ ఒక కంట కనిపెడుతూనే ఉంటామని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. అగ్రరాజ్యం చట్టాలు, నిబంధనలను పాటించకుంటే వారి వీసాలను రద్దు చేయడమేకాకుండా దేశం నుంచి వారిని పంపించివేయనున్నట్టు స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్‌ విధానాలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Jul 13 , 2025 | 03:06 AM