TRF Terrorist Group: టీఆర్‌ఎఫ్ ప్రపంచ ఉగ్రవాద సంస్థ అమెరికా
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:11 AM
పహల్గాంలో దారుణ మారణకాండకు పాల్పడి 26 మందిని బలిగొన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్..

వాషింగ్టన్/న్యూఢిల్లీ, జూలై 18: పహల్గాంలో దారుణ మారణకాండకు పాల్పడి 26 మందిని బలిగొన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎ్‌ఫ)’ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ అయిన టీఆర్‌ఎఫ్.. పహల్గాం ఘటనకు ముందు కూడా పలు ఉగ్రదాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎ్‌ఫను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్‌టీవో)’, ‘ప్రత్యేకంగా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఎస్‌డీజీటీ)’గా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి విషయంలో న్యాయం జరగాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్ష మేరకు టీఆర్‌ఎ్‌ఫను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం’’ అని రూబియో పేర్కొన్నారు. అమెరికా నిర్ణయంపై విదేశాంగ మంత్రి జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అమెరికా సరైన సమయంలో తీసుకున్న కీలక నిర్ణయమని.. భారత్-అమెరికా మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి