Airlines fire.. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:13 AM
హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు.

హ్యూస్టన్: అమెరికా (America)లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానంలో మంటలు (Fire) చెలరేగాయి. హ్యూస్టన్ (Houston)లోని టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణీకులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు పంపించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం ఇంజన్‌లో సమస్య రావడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఇటీవల అమెరికాలో రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. మళ్లీ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. గతంలో కూడా రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. అది మరువక ముందే మరొక ప్రమాదం జరగడంపట్ల అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా విమాన ప్రమాదాలు జరగడం పట్ల ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానం ఎక్కాలంటే ప్రయాణీకులు భయపడుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..
అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు (America) చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు. ప్రయాణికులు క్షేమంగా బయటపటడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు (US Airliner) చెందిన 1382 విమానం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెలుతోంది. ఈ నేపథ్యంలో హ్యూస్టన్‌లోని జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా విమానం రెక్కలలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపివేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు ఉన్నారని, అంతా క్షేమంగానే బయటపడ్డారని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా మూడు రోజుల క్రితం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియాలో ప్రమాదవశాత్తూ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాలో జనావాసాలపైకి దూసుకెళ్లింది. దీంతో భారీ పేలుడుతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇళ్లు, వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) ప్రకారం.. లియర్‌జెట్ 55 అనే చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 06:30 గంటలకు బయలుదేరింది. నాలుగు మైళ్లు(6.4 కి.మీ.) ప్రయాణించే లోపే మిస్సౌరీలోని స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాన్సన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో కూలిపోయింది. వాతావరణం పరిస్థితుల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(NTSB) దర్యాప్తు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే జనవరి 31న వాషింగ్టన్ సమీపంలో ఆర్మీ హెలికాఫ్టర్, ఓ విమానం ఢీకొని 64 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ కీలక సమావేశం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News