Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత
ABN , Publish Date - Mar 04 , 2025 | 08:28 AM
వైట్‌హౌస్‌తో వాగ్వివాదం తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చాడు. ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వాగ్వివాదానికి దిగిన ట్రంప్.. తాజాగా భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు ప్రకటించారు. రష్యాతో శాంతి చర్యల కోసం ఉక్రెయిన్‌పై మరింతగా ఒత్తిడి పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ భద్రతకు తగిన హామీలు లభిస్తేనే రష్యాతో చర్చలకు అంగీకరిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు కొంతకాలంగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే (Trump Pauses Military Aid To Ukraine ).
ఉక్రెయిన్‌కు సాయం నిలిపివేతపై అంతకుముందే డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సాయం నిలిపివేతను కొట్టిపారేయలేమని విలేకరులు అడగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జెలెన్‌స్కీ తీరును ఎక్కువ కాలం సహించబోనని, అమెరికా చేస్తు్న్న సాయానికి ఆయన కృతజ్ఞత చూపాలని కూడా అన్నారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం లేకుండా జెలెన్‌స్కీ ఎక్కువ కాలం మనలేరని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు.
Withdrawl from NATO: నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం: ఎలాన్ మస్క్
‘‘అమెరికా అధ్యక్షుడు శాంతి స్థాపనపైనే దృష్టి పెట్టారు. ఈ లక్ష్యానికి అమెరికా భాగస్వామ్య దేశాలు కూడా కట్టుబడి ఉండాలి కదా’’ అని శ్వేత సౌధం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘సమస్యకు పరిష్కారంగా తాము సాయాన్ని తాత్కాలికంగా నిలిపి వేసి సమీక్ష నిర్వహిస్తాము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.
తాను శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నానని జెలెన్‌స్కీ కూడా సోమవారం స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. అయతే, రష్యా మాత్రం ఈ విషయంలో నిబద్ధత ప్రదర్శించట్లేదని విమర్శించారు. తమ భద్రతకు కచ్చితమైన హామీలు లభించడమే ఈ యుద్ధానికి ముగింపు అని అన్నారు.
US Official Language English: అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను ప్రకటించిన ట్రంప్
యుద్ధ విరమణకు అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఐరోపా దేశాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కనీసం ఒక నెల పాటు ఇరు దేశాల మధ్యా కాల్పుల విరమణ కోసం బ్రిటన్, ఫ్రాన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. యుద్ధ విరమణ ఇంకా చాలా దూరంలో ఉందని, శాంతి స్థాపన దిశగా ఇవి తొలి అడుగులు మాత్రమేనని అన్నారు. ఉక్రెయిన్ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీలు దక్కినప్పుడే నిజమైన శాంతి స్థాపన జరుగుతుందని జెలెన్‌స్కీ సోమవారం ఓ వీడియో సందేహంలో అన్నారు. ఇలాంటి హామీలు లేని కారణంగానే రష్యా 11 ఏళ్ల క్రితం ఉక్రెయిన్‌పై దాడి చేసి క్రిమియాను ఆక్రమించుకోగలిగిందని గుర్తు చేశారు. చివరకు రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి తెరతీసేలా అవకాశం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి