Trump Scholarship: పుట్టిన ప్రతి బిడ్డకు బహుమతి..స్కాలర్‌షిప్‌తో జనన ప్రోత్సాహం
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:43 AM
అగ్రరాజ్యం అమెరికా మాంద్యం పరిస్థితులతోపాటు మరో సమస్యను ఎదుర్కొంటోంది. అదే జననాల రేటు. అమెరికాలో జనన రేటు చాలా తక్కువగా ఉందని, అందుకోసం తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

అమెరికాలో తగ్గుతున్న జనన రేటును పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సాంప్రదాయ కుటుంబ విలువలను పునరుద్ధరించి, కుటుంబ విస్తరణను జాతీయ ప్రాధాన్యతగా మార్చాలని ఈ ప్రతిపాదనలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. జనన రేటు తగ్గడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలు, వృద్ధాప్య జనాభా, తగ్గిపోతున్న శ్రామిక శక్తి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఒక మహిళకు సగటున 1.62 జననాలు ఉన్నాయి. ఇది జనాభా స్థిరీకరణకు అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం మారాలని ఆర్థికవేత్తలు, సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ జనాభా ఉంటే శ్రామికశక్తితోపాటు జీవనం కూడా సమస్యగా మారుతుందన్నారు.
ట్రంప్ సర్కార్ సంచలన ప్రతిపాదనలు
ఈ క్రమంలో కుటుంబ విస్తరణను ప్రోత్సహించేందుకు ట్రంప్ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వీటిలో కొన్ని
బేబీ బోనస్: కొత్త తల్లులకు ఒక్కొక్కరికి $5,000 ఒక్కసారి చెల్లింపు
స్కాలర్‌షిప్ ప్రయోజనాలు: ప్రతిష్టాత్మక ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌లలో 30% వివాహితులు లేదా తల్లిదండ్రుల కోసం రిజర్వ్
నేషనల్ మెడల్ ఆఫ్ మదర్‌హుడ్: ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల తల్లులకు సన్మానం
IVF సబ్సిడీలు: ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)కు సులభ యాక్సెస్
మెన్‌స్ట్రువల్ సైకిల్ ఎడ్యుకేషన్: ఒవ్యులేషన్ ప్యాటర్న్స్‌పై మహిళలకు ప్రభుత్వ నిధులతో విద్యా కార్యక్రమాలు
ప్రముఖుల స్పందన
వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా అమెరికాలో ఎక్కువ బేబీలు కావాలని మార్చ్ ఫర్ లైఫ్ వంటి ఈవెంట్‌లలో ప్రస్తావించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, 13 మంది పిల్లల తండ్రి, “జనన రేటు పెరగకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ కూడా దీనిపై కొత్త బేబీ బూమ్ కావాలని పిలుపునిచ్చారు. క్రమంలో మేము బేబీ బూమ్‌లకు మద్దతు ఇస్తామని, బోనస్‌లతోపాటు బేబీ బూమ్‌ను సమర్థిస్తామన్నారు.
విమర్శలు, సమర్థనలు
కన్సర్వేటివ్ సభ్యులు ఈ చర్యలను సాంప్రదాయ కుటుంబ విలువల ప్రోత్సాహంగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు, దత్తత కుటుంబాలు, ఒంటరి తల్లిదండ్రులు, సాంప్రదాయ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వ్యక్తులను విస్మరిస్తున్నారని సమ్మిళిత కుటుంబ విధానాల కోసం వాదించే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఈవ్ ఫీన్‌బెర్గ్ ఈ ప్రతిపాదనలను శాస్త్రీయం కంటే భావజాల ఆధారితమని విమర్శించారు. ఆమె రీప్రొడక్టివ్ హెల్త్ రీసెర్చ్, వంధ్యత్వ చికిత్సకు నిధులు పెంచడాన్ని స్వాగతించారు. మహిళల ఆరోగ్యం చాలా కాలంగా నిధుల కొరతను ఎదుర్కుంటోందని ఆమె అన్నారు.
జనన రేటు పెరగాలంటే ఆర్థిక భద్రత కీలకం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుటుంబాలు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నప్పుడు, వారు కుటుంబాన్ని విస్తరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్‌తో మోడీ అత్యవసర భేటీ
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. భారత్‌కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News