Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:45 AM
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న న్యూయార్క్‌లో ఒక ప్రమాదం సంభవించగా, తాజాగా మరోటి జరిగింది. ల్యాండింగ్ సమయంలోనే ప్రయాణికుల ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Plane Crash: గత కొన్ని రోజులుగా విమాన ప్రమాదాల సంఖ్య ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల అమెరికాలో ఘోర విమాన ప్రమాద ఘటన మరువక ముందే, తాజాగా మరొకటి చోటుచేసుకుంది. ఈ క్రమంలో దక్షిణ ఫ్లోరిడాలోని బోకా రాటన్ ప్రదేశంలో సెస్నా 310 అనే చిన్న ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం ఉదయం సమయంలో బోకా రాటన్ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఇంటర్‌స్టేట్ 95 హైవేపై జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల స్పందన
విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అది మంటల్లో తగలబడి రోడ్డుపై పడిపోయింది. ఈ సమయంలో సమీపంలో వెళ్తున్న కారుపై కూడా విమానం ప్రభావం చూపింది. దీంతో ఆ కారు డ్రైవర్ గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డాడు. ఈ ప్రమాదాన్ని జోష్ ఓర్సినో అనే 31 ఏళ్ల యువకుడు ప్రత్యక్షంగా చూశాడు. ఒవర్‌పాస్‌పై రెడ్ లైట్ వద్ద నిలిచినప్పుడు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందన్నారు. వెంటనే మా వైపు పెద్ద అగ్ని గోళం వచ్చిందని, తాటి చెట్లు మంటల్లో చిక్కుకున్నాయని, మొదట ఇది ఆయిల్ రిగ్ పేలుడు అనుకున్నానని చెప్పారు.
ముగ్గురు మృతి
విమానాలు తక్కువగా ఎగురుతూ ఉండడం చూస్తూనే ఉంటామని, కానీ ఈసారి ల్యాండింగ్ సమయంలో ఏదో తేడా ఉన్నట్లు అనిపించిందని చూసిన మరో వ్యక్తి తెలిపారు. భారీ శబ్దంతో భవనం మొత్తం కదిలినట్లుగా అనిపించిందని వెల్లడించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. అదే సమయంలో కారులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయని చెప్పారు.
కూలిపోయిన విమానం వివరాలు
ఈ ప్రమాదంలో కూలిపోయిన విమానం Cessna 310. ఇది రెండు ఇంజిన్‌లతో కూడిన చిన్న ఫ్లైట్. సాధారణంగా వ్యాపార ప్రయాణాలు, శిక్షణా అవసరాలకు వినియోగిస్తారు. విమానం బోకా రాటన్ విమానాశ్రయం నుంచి తల్లాహస్సీకి బయలుదేరింది. కానీ మధ్యలోనే ఇది నియంత్రణ కోల్పోయి, ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి కేవలం ఒక్క రోజు ముందు, న్యూయార్క్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News