Share News

Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు

ABN , Publish Date - Jul 06 , 2025 | 07:58 PM

ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.

Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు
Texas floods

టెక్సాస్, అమెరికా జులై, 6: ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51 మంది మృతి చెందారు. 27 మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.

Texas-floods-15.jpgకెర్ కౌంటీలో వరదల కారణంగా 15 మంది పిల్లలు సహా కనీసం 43 మంది మరణించారు. సమీపంలోని కౌంటీలలో కనీసం ఎనిమిది మంది చనిపోయారు.

Texas-floods-1.jpgవిధ్వంసకరంగా కనిపిస్తున్న చెట్లు.. బోల్తాపడి చెట్ల మీద, కల్వర్టుల మీదా కూర్చొన్న కార్లు, బురదతో నిండిన శిథిలాలతో సెంట్రల్ టెక్సాస్ భయానకంగా మారింది.

Texas-floods-2.jpgకెర్ కౌంటీలోని నది వెంబడి ఉన్న క్రైస్తవ వేసవి శిబిరమైన క్యాంప్ మిస్టిక్ లో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా అభ్యసిస్తున్న 27 మంది బాలికలు వరద నీటిలో కొట్టుకుపోయారు. వీరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Texas-floods-17.jpg


Texas-floods-12.jpgశుక్రవారం తెల్లవారుజామున కేవలం 45 నిమిషాల్లోనే గ్వాడాలుపే నది విధ్వంసకరంగా మారిపోయింది. వేగంగా ప్రవహించుకుంటూ వచ్చిన వరదనీరు నిమిషాల్లోనే 26 అడుగులు (8 మీటర్లు) ఎత్తు పెరిగి ఇళ్లు, వాహనాలను తుడిచిపెట్టింది.

Texas-floods-7.jpgఅటు, శనివారం కూడా శాన్ ఆంటోనియో వెలుపల వర్షాలు కురుస్తూనే ఉండటంతో ప్రమాద హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఆకస్మిక వరద హెచ్చరికలు ఇంకా కొనసాగుతున్నాయి.

Texas-floods-5.jpgవరదల్లో కొట్టుకుపోయిన బాధితులను వెతకడానికి, చెట్లలో చిక్కుకున్న వారిని రక్షించడానికి హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్‌ల సాయంతో గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.

Texas-floods-3.jpg


Texas-floods-8.jpgటెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఆదివారాన్ని రాష్ట్రం కోసం ప్రార్థనా దినంగా ప్రకటించారు. ఇక, అధికారులు 24 గంటలూ పని చేస్తారని, నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు మరింత ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు.

Texas-floods-6.jpgరాష్ట్ర విపత్తు ప్రకటన జారీ చేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అదనపు వనరులను అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు.

Texas-floods-16.jpg


Texas-floods-10.jpg

బాధితుల కోసం తాను, తన భార్య మెలానియా ప్రార్థిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 'మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్‌లో ఉన్నారు. వారు ఉత్తమంగా పని చేస్తున్నారని' సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.

Texas-floods-19.jpg


Texas-floods-14.jpgఇక, కీలకమైన సెంట్రల్ టెక్సాస్‌లోని గ్వాడాలుపే నది వెంబడి ఉన్న కొండలు.. శతాబ్దాల నాటి యూత్ క్లబ్స్, క్యాంప్‌ గ్రౌండ్‌లతో నిండి ఉంటాయి.

Texas-floods-18.jpgదీంతో ఈ ప్రదేశానికి తరతరాలుగా అనేక కుటుంబాలు స్విమ్మింగ్ చేయడానికి, గార్డెన్ పార్టీలు చేసుకోడానికి తరలివస్తారు.

Texas-floods-4.jpgఅదీ.. జులై నాల్గవ తేదీ సెలవుదినం కావడంతో ఈ నదీ తీరం మరింత రద్దీగా ఉంది. దీంతో ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతమంది తప్పిపోయారో లెక్కించడం కష్టతరంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

Texas-floods-10.jpg


ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 08:29 PM