Share News

Sleeping Prince Death: స్లీపింగ్‌ ప్రిన్స్‌ అల్‌ వలీద్‌ కన్నుమూత

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:05 AM

గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్‌ వలీద్‌ బిన్‌ 36 కన్నుమూశారు.

Sleeping Prince Death: స్లీపింగ్‌ ప్రిన్స్‌ అల్‌ వలీద్‌ కన్నుమూత
Sleeping Prince Death

  • 2005లో యాక్సిడెంట్‌తో కోమాలోకి సౌదీ యువరాజు

న్యూఢిల్లీ, జూలై 20: గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్‌ వలీద్‌ బిన్‌ (36) కన్నుమూశారు. వలీద్‌ బిన్‌ మరణం విషయాన్ని ఆయన తండ్రి ప్రిన్స్‌ ఖలీద్‌ బిన్‌ తలాల్‌ అల్‌ సౌద్‌ ఓ ప్రకటన ద్వారా ధ్రువీకరించారు. గ్లోబల్స్‌ ఇమామ్స్‌ కౌన్సిల్‌ కూడా వలీద్‌ మృతిపై సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్‌ వలీద్‌ బిన్‌ ‘స్లీపింగ్‌ ప్రిన్స్‌’గా వార్తలో నిలిచిన విషయం తెలిసిందే. 2005లో లండన్‌లో ఓ కారు ప్రమాదానికి గురైన ఆయన దాదాపు 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నారు. ప్రముఖ సౌదీ రాజు, బిలియనీర్‌ ప్రిన్స్‌ అల్‌ వలీద్‌ బిన్‌ తలాల్‌ అల్లుడు ఖలీద్‌ బిన్‌కు పెద్దకుమారుడైన అల్‌ వలీద్‌ 1990లో జన్మించారు. యూకేలోని ఓ మిలటరీ కాలేజీలో చదువుతుండగా.. 15 ఏళ్ల వయస్సులో ఓ కారు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన మెదడుకు తీవ్రగాయాలతో పాటు అంతర్గత రక్తస్రావమైంది. అప్పటి నుంచి ఆయన కోమా నుంచి బయటకు రాలేకపోయారు. ప్రమాదం తర్వాత వలీద్‌ బిన్‌ను రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో దాదాపు రెండు దశాబ్దాల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఇక కోలుకొనే అవకాశం లేదని భావించి.. వెంటిలేటర్‌ను తొలగించాలని వైద్యులు సూచించినప్పటికీ, కోలుకుంటాడన్న ఆశతో ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. ఒకానొక సమయంలో అల్‌ వలీద్‌ కొద్దిగా కోలుకుంటున్నట్లు కనిపించారు. చేతి వేళ్లను కొంచెం పైకి లేపడం వంటి సందర్భాలు అతని కుటుంబసభ్యులకు ఆశ కలిగించాయి..

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:05 AM