Home » Saudi Arabia
ఇటీవల ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో యూఎస్‌కు చెందిన అవాక్స్ నిఘా విమానం ధ్వంసమైంది.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో ప్రపంచ దేశాలు కాస్త ఉపశమనం పొందాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం సంచలనంగా మారింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర ఏప్రిల్ నెలాఖరు నాటికి 180 డాలర్లకు చేరే అవకాశం ఉందని సౌదీ అధికారులు అంచనావేస్తున్నారు.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్ నిర్వహించాలని మొదట అనుకున్నా చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అధికారులు తెలిపారు.
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతంలో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఒక భారతీయుడు మృతి చెందినట్టు వచ్చిన వార్తలను రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారంనాడు తోసిపుచ్చింది. అల్ ఖర్జ్ వద్ద జరిగిన దాడి ఘటనలో భారత్‌కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.
పశ్చిమాసియలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఆమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది.
ఆపరేషన్ సిందూర్ అనంతరం గతేడాది సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. నాటో తరహాలో రెండు....
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. రెండు దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు.
సౌదీ అరేబియాలోని ఎడారి ఇసుక మంచుతో తడిసి తెల్లగా మారిపోయింది. ప్రకృతి గీసిన అందమైన పెయింటింగ్‌లా ఉంది. యూరప్, మధ్య ఆసియా నుంచి బలమైన చల్లని గాలుల కారణంగానే సౌదీ అరేబియాలో మంచు వర్షం కురుస్తోంది. దీంతో చాలా మంది హిమపాతాన్ని వీక్షించేందుకు సౌదీ వెళ్లానుకుంటున్నారు.
సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎప్పుడు వేడిగా ఉండే సౌదీ ఎడారిలో ఇప్పుడు తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్లు కనిపిస్తుంది. ఎడారిలో మంచు కురవడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచిన అద్భుత దృశ్యం.