Share News

Sheikh Hasina: షేక్ హసీనాకు మరణ శిక్ష.. ఐసీటీ తీర్పు

ABN , Publish Date - Nov 17 , 2025 | 02:47 PM

నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్‌ఆర్మ్స్‌, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Sheikh Hasina: షేక్ హసీనాకు మరణ శిక్ష.. ఐసీటీ తీర్పు
Sheikh Hasina

ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 (ICT-1) దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఐసీటీ తాజా తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు.


నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్‌ఆర్మ్స్‌, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. హసీనాకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్‌కు మధ్య జరిగిన సంభాషణలను కూడా ఆయన చదివి వినిపించారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను హసీనా రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు తగిన ఆధారాలున్నాయని చెప్పారు. జూలై 14న మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.


విద్యార్థుల ఆందోళనతో పదవీచ్యుతురాలైన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఒక రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. తనపై తీర్పు నేపథ్యంలో కూడా... కోర్టు ఏ తీర్పునిచ్చినా తన ప్రాణం ఉన్నంతవరకూ ప్రజల కోసమే పనిచేస్తానని, దేశం కోసం తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఒళ్లు జలధరించే వీడియో.. కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..

మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 04:09 PM