Share News

Trump tariff cuts: ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్.. పలు వస్తువులపై సుంకాలు తగ్గింపు..

ABN , Publish Date - Nov 16 , 2025 | 08:43 AM

సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

Trump tariff cuts: ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్.. పలు వస్తువులపై సుంకాలు తగ్గింపు..
Donald Trump tariff cuts

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇటీవల జరిగిన హాఫ్-ఇయర్ ఎన్నికలలో అమెరికన్లు ఆర్థిక ఆందోళనలను తమ ప్రధాన సమస్యగా పేర్కొన్నారు (US consumer prices).


తాజాగా న్యూజెర్సీ, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోయి డెమొక్రాట్లు విజయం సాధించారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడంతో ట్రంప్ దిగి వచ్చారు. గొడ్డు మాంసం, కాఫీ, అరటి పండ్లు, నారింజ, పండ్ల రసం వంటి పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. పలు దేశాలపై భారీగా సుంకాలు విధించినప్పటికీ ఆ ప్రభావం వినియోగదారులపై పడదని ఇంత కాలం ట్రంప్ చెబుతూ వచ్చారు. అయితే గొడ్డు మాంసం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో తమ ప్రతాపం చూపించారు (beef tariff drop).


అమెరికాకు భారీగా బ్రెజిల్ నుంచి గొడ్డు మాంసం ఎగుమతి అవుతుంది (import duties reduction). బ్రెజిల్‌పై కూడా ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దీంతో గొడ్డు మాంసం ధర భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ట్రంప్ దిగి వచ్చారు. గొడ్డు మాంసంతో పాటు పలు ఆహార ఉత్పత్తులు, ఎరువులపై సుంకాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

వెనక్కి తగ్గేది లేదు.. బీబీసీపై ట్రంప్ రూ.44 వేల కోట్ల దావా..


క్షమాపణలు చెప్పిన బీబీసీ.. డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 09:40 AM