Share News

Trump lawsuit: వెనక్కి తగ్గేది లేదు.. బీబీసీపై ట్రంప్ రూ.44 వేల కోట్ల దావా..

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:11 AM

అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేయడంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు

Trump lawsuit: వెనక్కి తగ్గేది లేదు.. బీబీసీపై ట్రంప్ రూ.44 వేల కోట్ల దావా..
Trump sues BBC

బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ బ్రిటీష్ బ్రాడ్‌ కాస్టింగ్ కార్పొరేషన్‌పై చర్యల విషయంలో వెనక్కి తగ్గకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేయడంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు (BBC video edit).


ట్రంప్‌పై ప్రసారం చేసిన వార్త గురించి బీబీసీ విచారం వ్యక్తం చేసింది. ట్రంప్‌నకు బహిరంగంగా క్షమాపణ చెబుతూ వైట్‌హౌస్‌కు లేఖ రాసింది. అయితే బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించడానికి నిరాకరించింది. దీంతో ట్రంప్ పరవు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. 'నా నోటి నుంచి రాని మాటలను వారు తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేశారు. అది ఎడిటింగ్ లోపమని చెబుతూ క్షమాపణలు అడిగారు. కానీ, నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించారు. అందుకే వారిపై దావా వేయాలని ఆలోచిస్తున్నా. వచ్చే వారంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌తో మాట్లాడతా. ఆ తర్వాత బీబీసీపై 100 కోట్ల డాలర్ల నుంచి 500 కోట్ల డాలర్ల వరకు దావా వేస్తా' అని ట్రంప్ తెలిపారు (Trump sues BBC).


జనవరి 6, 2021న తాను చేసిన ప్రసంగాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు (Panorama edit controversy). సదరు ఎడిటింగ్‌పై బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు. ఇప్పటికే ఈ వివాదానికి బాధ్యత వహిస్తూ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ ఛీప్ టర్నెస్ డెబోరా రాజీనామ చేశారు. కాగా, ట్రంప్ డిమాండ్ చేసిన ఒక బిలియన్ డాలర్ నష్టపరిహారాన్ని మాత్రం చెల్లించేందుకు బీబీసీ నిరాకరించింది.


ఇవి కూడా చదవండి:

అంగారకుడి పైకి ప్రయాణం ప్రారంభం.. ఎస్కపేడ్ ప్రయోగం విజయవంతం..


క్షమాపణలు చెప్పిన బీబీసీ.. డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా..


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 07:11 AM