Trump sues BBC: క్షమాపణలు చెప్పిన బీబీసీ.. డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా..
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:15 AM
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు.
కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 6, 2021న తాను చేసిన ప్రసంగాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు (Trump legal action on BBC). బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు. ఇప్పటికే ఈ వివాదానికి బాధ్యత వహిస్తూ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ ఛీప్ టర్నెస్ డెబోరా రాజీనామ చేశారు. కాగా, ట్రంప్ డిమాండ్ చేసిన ఒక బిలియన్ డాలర్ నష్టపరిహారాన్ని మాత్రం చెల్లించేందుకు బీబీసీ నిరాకరించింది (misleading edit controversy).
బీబీసీ క్షమాపణలు చెప్పడంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ($1 billion lawsuit BBC). బీబీసీ క్షమాపణ చెప్పడం పట్ల బ్రిటిష్ సాంస్కృతిక మంత్రి లిసా నాండీ స్పందించారు. 'వారు అత్యున్నత ప్రమాణాలను పాటించలేదని అంగీకరించారు. దాని ఆధారంగానే బోర్డు ఛైర్మన్ అమెరికా అధ్యక్షుడికి క్షమాపణ చెప్పారు' అని లీసా పేర్కొన్నారు. కాగా, బీబీసీ సమస్య గురించి తాను ఇంకా యుకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌తో మాట్లాడలేదని , ఈ వారాంతంలో స్టార్మర్‌కు ఫోన్ చేస్తానని ట్రంప్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి