Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ABN , Publish Date - Mar 14 , 2025 | 09:43 AM
ఉక్రెయిన్‌తో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనలపై తొలిసారిగా స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ వివిధ దేశాధినేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిత్యం బిజీగా ఉంటున్నా ఉక్రెయిన్ అంశంపై దృష్టి సారించినందుకు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ పేర్లును ప్రస్తావించారు.
‘‘మొట్టమొదటగా నేను అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. ఉక్రెయిన్‌తో సెటిల్మెంట్‌పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మనం అందరం నిత్యం ఎంతో బిజీగా ఉంటున్నాము. అయితే, జీ జింగ్‌పింగ్, నరేంద్ర మోదీ, బ్రెజిల, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఈ వివాదంపై దృష్టిపెట్టారు. పరిష్కారం కోసం బోలెడంత సమయాన్ని వెచ్చించారు. ఘర్షణలు సద్దుమణికి మనుషుల ప్రాణాలను కాపాడే ఉదాత్తమైన లక్ష్యం దిశగా పనిచేస్తు్న్న వారందరికీ కృతజ్ఞతలు’’ అని పుతిన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Donald Trump: ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..
గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమైన ప్రధాని మోదీ.. ఈ విషయంలో శాంతి నెలకొల్పానేదే భారత్ అభిప్రాయమని పేర్కొన్నారు. ఇది యుద్ధాల కాలం కాద అని పుతిన్‌కు చెప్పా. శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడి ప్రయత్నాలకు అండగా ఉంటా’’ అని మోదీ పేర్కొన్నారు. ఇక యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రధాని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో పలుమార్లు చర్చించారు.
ఇదెలా ఉంటే.. కనీసం 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని అమెరికా రష్యాను కోరింది. అయితే, పుతిన్ మాత్రం ఒప్పందం తాలుకు సుక్ష్మమైన అంశాలపై స్పష్టత రావాలని అభిప్రాయపడ్డారు. ఒప్పందాన్ని ఎలా అమలు చేస్తారో తెలియాల్సి ఉందన్నారు. ఇక పుతిన్ వ్యాఖ్యలు హర్ణనీయమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, కొన్ని అంశాల్లో అసంపూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.
NASA mission delay: వ్యోమగాముల రాక మరింత ఆలస్యం.. చివరి నిమిషంలో
2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో, లక్షల మంది మరణించారు. ఇంత అనేక రెట్లు నిరాశ్రయులుగా మారిపోయారు. అనేక నగరాలు నేలమట్టమైపోయాయి. దశాబ్దాల తరువాత రష్యా, పాశ్యాత్య దేశాల మధ్య ఘర్షణలు పతాకస్థాయికి చేరుకున్నాయి.
Read Latest and International News