Putin: ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పుతిన్
ABN , Publish Date - May 25 , 2025 | 07:22 PM
ప్రెసిడెంట్ (పుతిన్) ఎయిర్ రూట్‌పై ప్రయోగించిన ఉక్రెయిన్ డ్రోన్‌ను అక్కడికి చేరకముందే మార్గమధ్యంలోని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుకుని కుప్పకూల్చినట్టు అధికారులు చెప్పారు. ప్రెసిడెంట్ కాన్వాయ్‌ను గాల్లో ఉండగానే ఢీకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాటి యత్నంగా దీనిని రక్షణ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రష్యా మీడియా తెలిపింది.

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladmir Putin) హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించింది. అయితే ఈ దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నట్టు అధికారులు తెలిపారు. రష్యాలోని సెన్సిటివ్ బోర్డర్ ప్రాంతం కుర్స్క్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత పుతిన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఉక్రెయిన్ బలగాలను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టినట్టు ఏప్రిల్‌లో మాస్కో ప్రకటించినప్పటి నుంచి కుర్స్క్ ఏరియాలో పుతిన్ పర్యటించడం ఇదే ప్రథమం.
Pak Minister Khwaja Asif: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు అమెరికా కారణం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రెసిడెంట్ (పుతిన్) ఎయిర్ రూట్‌పై ప్రయోగించిన ఉక్రెయిన్ డ్రోన్‌ను అక్కడికి చేరకముందే మార్గమధ్యంలోని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుకుని కుప్పకూల్చినట్టు అధికారులు చెప్పారు. ప్రెసిడెంట్ కాన్వాయ్‌ను గాల్లో ఉండగానే ఢీకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాటి యత్నంగా దీనిని రక్షణ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రష్యా మీడియా తెలిపింది. అయితే ఈ ప్రయత్నాన్ని ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ వెంటనే గ్రహించి డ్రోన్‌నూ కూల్చేయడం ద్వారా ముప్పును తప్పించినట్టు ఆ అధికారి చెప్పారు. ఉక్రెయిన్ డ్రోన్ ఏవిధంగా కుర్స్క్ ఎయిర్ స్పేస్‌ను ఉల్లంఘించింది? ఇది హత్యాయత్నం కావచ్చా? కీవ్ సైకలాజికల్ స్ట్రాటజీలో ఇదొక భాగమా? అనే కోణాల నుంచి ప్రస్తుతం భద్రతా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి.
కాగా, పుతిన్ ఎయిర్ రూట్‌లో డ్రోన్ దాడికి యత్నించినట్టు వస్తున్న వార్తలపై ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే 2024 ఆగస్టులో రష్యా వ్యూహాత్మక లొకేషన్లు, కుర్క్స్ ప్రాంతం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు జరిపింది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మాస్కోకు ఇది ఒక దెబ్బగా కూడా చెప్పవచ్చు. ఏప్రిల్ 26న కుర్స్క్‌పై పూర్తి పట్టుసాధించామని రష్యా ప్రకటించగా, ఈ వాదనను కీవ్ తోసిపుచ్చింది. ఇటీవల కాల్పుల విరమణకు అమెరికా, యూరప్ చేసిన ప్రతిపాదనకు క్రెమ్లిన్ తోసిపుచ్చడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్నాయి. ఉక్రెయిన్‌ను ఆయుధాలతో తిరిగి బలం పుంజుకునేలా చేసేందుకు పాశ్చాత్యదేశాలు సంధి చర్చల పేరుతో కాలహరణ చేస్తున్నాయని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సర్గే లావ్రోవ్ ఆరోపించారు.
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి