Ukraine Ceasefire: మే 8 నుంచి 10 వరకూ ఉక్రెయిన్‌పై రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
ABN , Publish Date - Apr 28 , 2025 | 07:33 PM
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న 'విక్టరీ డే' వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మానవతా దక్పథంతో తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది.

మాస్కో: ఉక్రెయిన్‌లో మే 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మూడు రోజుల పాటు కాల్పులను విరమిస్తున్నట్టు (Ceasefire) రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladmir Putin) ప్రకటించారు. మానవతా దృక్పథంతో పుతిన్ ఈ ఆదేశాలను జారీ చేసినట్టు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ సైతం కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటుందని తామ నమ్ముతున్నామని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం తమ ఆర్మీ ధీటుగా బదులిస్తుందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
వాటికన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఇటీవల సమావేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ తర్వాత పుతిన్‌పై మండిపడ్డారు. ''ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడి చేయడం ఏమాత్రం బాగోలేదు. ఆ అవసరం కూడా లేదు, దాడికి ఇది సరైన సమయం కూడా కాదు. వాడ్లిమిర్, స్టాప్! వారానికి 5000 మంది సైనికులు చనిపోతున్నారు. శాంతి ఒప్పందం జరగాలి'' అని ట్రంప్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మే 8 నుంచి 10వ తేదీ వరకూ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ ముందుగానే ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విక్టరీ డే..
కాగా, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న 'విక్టరీ డే' వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మానవతా దక్పథంతో మే 8 నుంచి 10వ తేదీ వరకూ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి కాల్పుల విరమణకు నిర్ణయించినట్టు క్రెమ్లిన్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..