PM Modi G20 Summit: గ్లోబల్ డవలప్‌మెంట్‌కు మోదీ 4 కీలక ప్రతిపాదనలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 09:05 PM
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్‌కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
జొహన్నెస్‌బర్గ్: జీ20 నేతల శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రపంచాభివృద్ధికి (Global Development) నాలుగు కీలక ప్రతిపాదనలు చేశారు. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆఫిక్రా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనీషియేటివ్‌ను ప్రతిపాదించారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాలు-ఉగ్రవాద సంబంధాన్ని అడ్డుకోవడానికి చొరవ తీసుకోవాలని సూచించారు. 'సమగ్ర, సుస్థిర ఆర్థిక వృద్ధి' అనే అంశంపై మోదీ శనివారంనాడు మాట్లాడుతూ, జీ20 దేశాలు సమష్టిగా అన్నిరంగాల్లోనూ వృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్‌కు సమున్నత చరిత్ర ఉందన్నారు. ఈ రిపాజిటరీ మన జ్ఞానాన్ని భావి తరాలకు అందించేందుకు ఉపయోగపడుతుందని సూచించారు.
మూడురోజుల దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న మోదీ, ప్రపంచ పురోగతికి ఆఫ్రికా అభివృద్ధి కీలకమని అన్నారు. ఆఫ్రికాకు భారత్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. 'జీ20 ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లైర్ ఇనీషియేటివ్'ను మోదీ ప్రతిపాదించారు. రాబోయే దశాబ్ద కాలంలో ఆఫ్రికాలో 10 మంది లక్షల మంది ట్రైనీలను తయారు చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు. 'జి20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్ టీమ్' ఏర్పాటుకు కూడా మోదీ ప్రతిపాదన చేశారు. ఇందువల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని వివరించారు. మాదకద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు, మాదకద్రవ్యాలు, ఉగ్రవాద సంబంధాన్ని అడ్డుకునేందుకు జీ20 చొరవ చూపాలని మోదీ సూచించారు. ఫైనాన్స్, గవర్నెన్స్, సెక్యూరిటీకు విషయంలో కలిసికట్టుగా వ్యవహరించి డ్రగ్-టెర్రర్ ఎకానమీని బలహీన పరచాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
యూరప్‌ను భయపెడుతున్న జనాభా తగ్గుదల.. 2100 నాటికి దారుణ పరిస్థితి..
మిస్‌యూనివర్స్‌గా మెక్సికో సుందరి ఫాతిమా బాష్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి