Share News

PM Modi: ఫ్రాన్స్‌లో అమరవీరులకు మోదీ శ్రద్ధాంజలి, ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:49 PM

దక్షిణ మార్సెయిల్‌లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ కూడా హాజరయ్యారు.

PM Modi: ఫ్రాన్స్‌లో అమరవీరులకు మోదీ శ్రద్ధాంజలి, ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఫ్రాన్స్‌ (France)లో జరుపుతున్న మూడు రోజుల అధికారిక పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారంనాడు పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. దక్షిణ మార్సెయిల్‌లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ కూడా హాజరయ్యారు.

PM Modi: వెల్ కం టూ మై ఫ్రెండ్.. మోదీకి స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు


ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం

మార్సె‌యిల్‌లో భారత కాన్యులేట్‌ కార్యాలయాన్ని కూడా మోదీ, మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. కాంటినెంటల్ ఫ్రాన్స్‌లో తొలి భారత రాయబార కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఇరుదేశాల మధ్య మరింత లోతైన సంబంధాలు ఏర్పడటంతో పాటు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు, మల్టీ డైమన్షయల్ రిలేషన్‌షిప్‌కు బలం చేకూరిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.


దీనికి ముందు పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో మాక్రాన్‌తో కలిసి సదస్సుకు మోద అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. రెండో దఫా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆదేశంలో మోదీ పర్యటించనుండటం ఇదే ప్రథమం.

Updated Date - Feb 12 , 2025 | 04:55 PM