Share News

Russia Plane Crash : రష్యాలో విమాన ప్రమాదం..49 మంది దుర్మరణం

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:48 AM

రష్యా తూర్పు సరిహద్దుల్లోని అమూర్‌లో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటనలో 49 మంది దుర్మరణంపాలయ్యారు.

Russia Plane Crash : రష్యాలో విమాన ప్రమాదం..49 మంది దుర్మరణం

  • ల్యాండింగ్‌ క్రమంలో కుప్పకూలిన విమానం

  • రష్యా-చైనా సరిహద్దు సమీపంలో దుర్ఘటన

  • ప్రతికూల వాతావరణమే కారణమన్న అంచనాలు

మాస్కో, జూలై 24: రష్యా తూర్పు సరిహద్దుల్లోని అమూర్‌లో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటనలో 49 మంది దుర్మరణంపాలయ్యారు. వీరిలో 43 మంది ప్రయాణికులు కాగా.. మిగతా ఆరుగురిలో విమాన పైలట్లు, సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు రష్యా మీడియా పేర్కొంది. ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. పైలట్‌ తప్పిదమా? లేక.. సాంకేతిక లోపమా? అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. గురువారం ఉదయం బ్లాగోవె్‌షచెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరిన అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానంతో తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. పరిస్థితులు అనుకూలించలేదు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) నుంచి సిగ్నళ్లు తెగిపోయాయి. దీంతో అధికారులు ఎమర్జెన్సీ సేవలకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఆ విమానం తన గమ్యస్థానం టిండాకు 15 కిలోమిటర్ల దూరంలో కుప్పకూలినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా కాలిపోయింది. రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ల్యాండింగ్‌ సమయంలో ప్రతికూల వాతావరణం, పైలట్‌ తప్పిదం ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గత ఏడాది సెప్టెంబరులో ఓ హెలికాప్టర్‌ అదృశ్యమైన విషయం తెలిసిందే..!

ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 02:48 AM