Masood Azhar: అబద్ధాలు ఆపని పాక్.. వీళ్లకు జన్మలో బుద్ధి రాదు!
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:17 AM
పాకిస్థాన్ అంటే అబద్ధాల పుట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునే శత్రుదేశం.. మరోమారు తమ నిజస్వరూపం చూపించింది.

కుక్క తోక వంకర.. అనే సామెత పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడూ భారత్ మీద పడి ఏడ్చే ఈ దేశం.. తన ప్రవృత్తిని ఇంకా మార్చుకోవడం లేదు. ఉగ్రవాదులను ఇండియా మీదకు ఉసిగొల్పే పాకిస్థాన్.. టెర్రరిస్టులకు స్వర్గధామంగా మారింది. వాళ్లను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాల ముందు తమకేమీ తెలియదంటూ నీతివాక్యాలు వల్లిస్తూ వస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చావుదెబ్బ తీసినా పాక్‌కు ఇంకా బుద్ధి రావడం లేదు. కుక్క తోక వంకర అనే రీతిలో అబద్ధాలు ఆపని పాక్.. ఇండియాను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అసలేం జరిగిందంటే..
అరెస్ట్‌కు రెడీ..
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు మసూద్ అజహర్, హఫీజ్ సయీద్‌లు ఉన్నారని భారత ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. వాళ్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. కానీ మసూద్, హఫీజ్ తమ దేశంలో లేరంటూ బుకాయిస్తూ వస్తోంది శత్రుదేశం. తాజాగా మరోమారు ఈ విషయంపై స్పందించారు పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ. జైషే మహ్మద్ చీఫ్ అయిన మసూద్ అజహర్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని చెప్పారు. ఒకవేళ అతడు ఎక్కడ ఉన్నారనే సమాచారం భారత్ గనుక చెబితే వెంటనే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కస్టడీలోనే..
‘హఫీస్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అనేది అవాస్తవం. అతడు పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో ఉన్నాడు. మసూద్ అజహర్‌ను మేం పట్టుకోలేకపోయాం. అతడు ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్నాడని భావిస్తున్నాం’ అని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. కాగా, పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ భారీ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబంలోని 10 మంది మృత్యువాత పడ్డారని వార్తలు వచ్చాయి. సొంతవాళ్లను కోల్పోయాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాని పేర్కొంటూ స్వయంగా మసూద్ పేరిట ఓ లేఖ కూడా విడుదలైంది.
ఇవీ చదవండి:
ఈ రాయి ధర 34 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే..
దలై లామా వారసుడి ఎంపికపై వివాదం
పిల్లలను కనండి.. ప్రతి ఏటా రూ.42 వేలు ఇస్తాం
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి