పాక్‌లో నాకు మరణ శిక్ష పడేలా ఉంది: జుకర్‌బర్గ్
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:46 AM
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో తనకు మరణశిక్ష పడేలా ఉందని ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో తనకు మరణశిక్ష పడేలా ఉందని ఆయన పేర్కొన్నారు. జో రోగన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పాక్‌లో ఫేస్‌బుక్‌పై నమోదైన దావా గురించి మాట్లాడారు. ప్రవక్త మహమ్మద్‌ను అవమానించేలా ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్ట్ పెట్టినందుకు తనకు మరణ శిక్ష విధించాలని పాకిస్తాన్‌లో దావా వేశారని చెప్పారు.
ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలియదని, అయితే తాను పాకిస్థాన్ వెళ్లాలనుకోవడం లేదు కాబట్టి దాని గురించి ఆందోళన చెందట్లేదని అన్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న చట్టాలు, సాంస్కృతిక విలువల కారణంగా యాప్‌లో చాలా కంటెంట్‌ను అణచివేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు.