Share News

Israel: గాజాను పూర్తిగా ఆక్రమించేద్దాం

ABN , Publish Date - May 06 , 2025 | 04:16 AM

ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ గాజాను పూర్తిగా ఆక్రమించేందుకు కొత్త ఆపరేషన్‌ను ఆమోదించింది. ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన తరువాత ఈ ఆపరేషన్‌ ప్రారంభించనున్నారు

Israel: గాజాను పూర్తిగా ఆక్రమించేద్దాం

  • కొత్త ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ ఆమోదం

టెల్‌అవీవ్‌, మే 5: హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజాను పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. సోమవారం జరిగిన ‘భద్రతపై ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ కమిటీ’ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 50శాతం గాజా ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉండగా.. ఉత్తరాదిని కూడా పూర్తిస్థాయిలో ఆక్రమించాలని తాజా భేటీ నిర్ణయించింది. అయితే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చే వారం పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. 13, 14 తేదీల్లో సౌదీ అరేబియా, 15న ఖతార్‌, 16న యూఏఈలను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాతే తమ ఆపరేషన్‌ ప్రారంభిస్తామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ బందీలను 16వ తేదీలోగా విడుదల చేయాలని, అలాగైతేనే కాల్పుల విరమణపై చర్చిస్తామని పేర్కొన్నాయి. లేదంటే తమ ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించాయి.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 04:16 AM