Share News

Ferry Fire: మంటల్లో ఫెర్రీ.. సముద్రంలోకి దూకిన ప్రయాణికులు

ABN , Publish Date - Jul 20 , 2025 | 09:26 PM

'కేఎం బార్సిలోనా 5' ఫెర్రీ టేలీజ్ ద్వీపం నుంచి మనడో పోర్ట్‌కు వెళ్తుండగా స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు.

Ferry Fire: మంటల్లో ఫెర్రీ.. సముద్రంలోకి దూకిన ప్రయాణికులు

జకార్తా: ఇండోనేషియా (Indonesia)లోని సులవేసి ద్వీపంలో ఆదివారంనాడు ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 300 మందితో వెళ్తున్న ఫెర్రీ మంటల్లో చిక్కుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పలువురు హాహాకారాలు చేస్తూ నీటిలోకి దూకారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.


ప్రమాద వివరాల ప్రకారం, 'కేఎం బార్సిలోనా 5' ఫెర్రీ టేలీజ్ ద్వీపం నుంచి మనడో పోర్ట్‌కు వెళ్తుండగా స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.30 గంటలకు ఫెర్రీలో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు. ప్రమాదంలో ముగ్గురు మరణించగా, సుమారు 260 మందిని సహాయక బృందాలు కాపాడినట్టు ప్రావిన్షియల్ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, జాడతెలియకుండా పోయిన ప్రయాణికుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయని వివరించారు.


ఇవి కూడా చదవండి..

రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడి కన్నుమూత

చైనాను వణికిస్తున్న మరో వ్యాధి.. కోవిడ్ తర్వాత ఏకంగా..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 09:27 PM