Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కమాండర్ మృతి
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:56 AM
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కమాండర్ అలీ సలేహ్ మృతిచెందాడు.

మరో ఇద్దరు హమాస్ కీలక నేతలు కూడా
అమెరికాలో నేడు ట్రంప్‌తో నెతన్యాహు భేటీ
గాజా, టెల్ అవీవ్, జూలై 6: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కమాండర్ అలీ సలేహ్ మృతిచెందాడు. హమా్‌సకు చెందిన మరో ఇద్దరు కీలక సభ్యులు మన్‌సూర్, సులేమాన్ కూడా హతమయ్యారు. గాజా నగరంతో పాటు మొత్తం వంద చోట్ల దాడులు ఇజ్రాయెల్ దాడులు చేయగా 61 మంది మృతిచెందారు. నగరంలోని శతి శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. అయితే పక్కనే ఉన్న అబు అసీ పాఠశాల లక్ష్యంగా దాడి జరిగిందని, ఈ దాడుల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో చనిపోయారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం అమెరికా వెళ్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చిస్తారు. హమా్‌సతో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు ఖతార్‌కు తమ ప్రతినిధులను పంపుతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది.