Share News

Elon Musk: ఎలాన్ మస్క్ సీక్రెట్ ప్లాన్ లీక్..పిల్లలను కనేందుకు మహిళలతో ఒప్పందాలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 07:38 PM

ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి ప్రముఖ సంస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చనీయాంశమయ్యారు. నివేదికల ప్రకారం మస్క్ గోప్యంగా సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి పలువురు మహిళలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Elon Musk: ఎలాన్ మస్క్ సీక్రెట్ ప్లాన్ లీక్..పిల్లలను కనేందుకు మహిళలతో ఒప్పందాలు
Elon Musks Secret Plan

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి అనేక సంస్థల అధినేతగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక వివాదాస్పద అంశంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల వెలువడిన ఓ జర్నల్ నివేదిక ప్రకారం, మస్క్ పిల్లల కోసం సరోగసీ ద్వారా పుట్టించడానికి పలువురు మహిళలతో రహస్య ఒప్పాందాలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ ప్రస్తుతం దాదాపు 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నారు. తాజాగా, అతని 13వ బిడ్డ రోములస్‌ను జన్మించిన ఆష్లే సెయింట్ క్లెయిర్ అనే మహిళతో అతని సంబంధం బయటపడింది.


దీంతోపాటు వారితో

ఆమె ప్రకారం, మస్క్ ఆమెకు గర్భం దాల్చడానికి ఆఫర్ చేశాడు. ఈ ఒప్పందం ప్రకారం, ఆమెకు నెలకు $10 నుంచి $15 మిలియన్ల వరకు ఆర్థిక సహాయం అందించబడింది. అయితే, ఆమె ఈ విషయం పబ్లిక్‌గా వెల్లడించడంతో, మస్క్ ఆ సహాయాన్ని తగ్గించి $20,000కి పరిమితం చేశాడని తెలిపింది. ఆష్లే సెయింట్ క్లెయిర్, మస్క్‌పై పితృత్వ ధృవీకరణ పత్రం నుంచి ఆయన పేరు తొలగించడానికి ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. ఈ వివాదం చట్టపరమైన దశలోకి వెళ్లింది. కానీ మస్క్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు.​


ఆమె తిరస్కరించడంతో

మస్క్, క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ టిఫనీ ఫాంగ్ వంటి ఇతర మహిళలతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కూడా గర్భం దాల్చడానికి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించడంతో, మస్క్ ఆమెను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. దీంతో ఆమె ఆన్‌లైన్ ఆదాయం తగ్గిందని ఆమె ఆరోపించారు. ఆమె తనను తానే "ఇష్టపడని క్రిప్టో జర్నలిస్ట్"గా పేర్కొంటుంది. ఆమె నిర్భయంగా అడిగే ప్రశ్నలు, బోల్డ్ ఇంటర్వ్యూలు ఆమెను క్రిప్టో మీడియా రంగంలో ప్రత్యేకంగా నిలిపాయి.


మస్క్ ఆలోచనా విధానం

మానవ నాగరికత క్రమంగా తగ్గిపోతుందని, అందుకే ఎక్కువ మంది పిల్లలను కనడం అవసరమని మస్క్ భావిస్తున్నారు. ఆయన మాటల్లో "మార్స్‌ కోసం ప్రజలు అవసరం" అని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే అతను మరో సైన్యాన్ని తయారు చేసేలా ఉన్నారని పలువురు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మరో గ్రహం కోసం అనేక మందిని తయారు చేసేలా ఉన్నాడని ఇంకొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎంత మందిని సృష్టిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 07:40 PM