Donald Trump: ట్రంప్ మంచి మనస్సు.. రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష..
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:22 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. మంగళవారం వైట్ హౌస్ లో జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కార్యక్రమంలో వాడిల్ అనే టర్కీ కోడిని క్షమించి వదిలేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టారు. టర్కీకి చెందిన ఆ రెండు కోళ్లకు క్షమాభిక్ష పెడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారం నుంచి దిగిపోయే అమెరికా అధ్యక్షులకు టర్కీ నుంచి కోళ్లను బహుమతిగా పంపుతారు. నూతన అధ్యక్షుడు వాటిని కోసుకొని తినడమో, లేదా క్షమించి వదిలేయడమో చేస్తారు. ఇది గత కొన్నేళ్లుగా వైట్ హౌస్‌లో ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైట్ హౌస్ ( White House ) సంప్రదాయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.
మంగళవారం వైట్ హౌస్‌లో ‘థ్యాంక్స్ గివింగ్ డే’ అనే మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ , మెలానియా దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ‘ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ వేడుక జరిగింది. శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో ట్రంప్ తనదైన శైలికి భిన్నంగా సిరీయస్ గా గడిపారు. ఈ ప్రొగ్రామ్ కు వాడిల్(Waddl), గోబుల్(Gobble)అనే రెండు టర్కీ కోళ్లు ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది. అయితే వాడిల్ మాత్రమే ఈ కార్యమక్రమంలో ప్రత్యక్షమైంది. అయినప్పటికీ ఈ రెండు కోళ్లకు ట్రంప్ క్షమభిక్ష ప్రసాదించారు. వాడిల్ కోడిని బాక్స్ నుంచి బయటకు స్వేచ్ఛగా వదిలేశారు. వాడిల్ తో ట్రంప్ దంపతులు కాసేపు సరదాగా గడిపారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ కు చాలా మంచి మనస్సు ఉందే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కోళ్లను ట్రంప్ క్షమించకుంటే.. అవి వారికి ఆహారంగా మారేవి. ఏటా Thanks Giving Day కు ముందు అధ్యక్షుడికి ‘ది నేషనల్ టర్కీ ఫెడరేషన్’ రెండు భారీ టర్కీ కోళ్లను బహూకరిస్తుంది. జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు అధ్యక్షులందరూ ఇలా బహుమతిగా వచ్చే టర్కీ కోళ్లను విందులో వినియోగించే వారు. జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ తదితరులు మాత్రం వీటిని తినకుండా క్షమాభిక్ష పెట్టి వదిలేశారు. కొంత మంది అధ్యక్షులు అసలు వాటిని స్వీకరించలేదు.
ఇవి కూడా చదవండి:
Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!