China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:45 AM
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం చైనా-అమెరికా వాణిజ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో అమెరికా ధోరణిపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు చైనా తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ఇంకా అలాగే ఉంది. క్రమంగా ఇది పెరుగుతుంది కానీ, తగ్గడం లేదు. అంతేకాదు తమపై సుంకాలు విధించిన అమెరికాపై చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO)కు కంప్లైంట్ చేసింది. ఇదే పరిస్థితి ఇతర దేశాలకు కూడా వచ్చే అవకాశం ఉంది గుర్తు చేసింది. ఈ క్రమంలో మిగతా దేశాలు కూడా ఈ అంశంపై కలిసి కట్టుగా పోరాడాలని వెల్లడించింది. దీనిపై అన్నీ దేశాలు ఐక్యంగా ఉంటేనే ఈ సుంకాల పరిమితిపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆధిపత్య రాజకీయాలు
దీంతోపాటు అమెరికా ఇతర దేశాల విషయంలో చైనా ప్రయోజనాలకు హానిచేసేలా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటే ఊరుకునేది లేదని వెల్లడించింది. తాము దృఢమైన, పరస్పర చర్యలతో స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి ఒప్పందాలను గట్టిగా వ్యతిరేకిస్తామని చెనా చెప్పింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో తన మిత్రదేశాలను చైనాతో వాణిజ్య సంబంధాలను తగ్గించమని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి ప్రతిఫలంగా సుంకాల నుంచి రాయితీలు, వాణిజ్య ప్రత్యేకాధికారాలు వంటివి అందిస్తున్నట్లు సమాచారం. చైనా దీనిని ఆధిపత్య రాజకీయాలు, ఏకపక్ష బెదిరింపులుగా అభివర్ణించింది. ఇది ప్రపంచ వ్యాపార విధానానికి పెద్ద ముప్పని అభిప్రాయ వ్యక్తం చేసింది.
ప్రస్తుతం చైనాపై సుంకాలు
2025 ఏప్రిల్ 15న, ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై కొత్తగా అనేక రకాల సుంకాలను విధించింది. వీటిలో 125% పరస్పర సుంకం, 20% ఫెంటానిల్ సంక్షోభానికి ప్రతిస్పందనగా, 7.5% నుంచి 100% వరకు సెక్షన్ 301 ప్రకారం వంటివి ఉన్నాయి. చైనా కూడా దీనిపై స్పందించింది. ఆ క్రమంలో అమెరికా వస్తువులపై అదే రీతిలో 125% సుంకాలు విధించింది. ఇదే సమయంలో ఈ దేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కానీ అవి ఫలప్రదమవుతాయా? లేదా మరోసారి ఉద్రిక్తతలకే దారి తీస్తాయా అనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Elon Musk: తల్లి బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..
Gold Rates Today: ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..ఈ వారం లక్షకు చేరుతుందా..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News