Share News

Canada Plans: హెచ్-1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్

ABN , Publish Date - Nov 06 , 2025 | 07:05 PM

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Canada Plans: హెచ్-1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్
Canada PLan

హెచ్‌-1బీ వీసాదారుల (H-1B Visa)కు కెనడా (Canada) ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. హెచ్‌-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా వ్యూహం రచిస్తోంది.

విదేశాలకు చెందిన వేలాది మంది టాప్ పరిశోధకులు, యునైటెడ్ స్టేట్స్ నుండి H-1B వీసా హోల్డర్ల కోసం కెనడా ప్రత్యేక ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది. ఇదే సమయంలో భారతీయ విద్యార్థులతో సహా విదేశీయ విద్యార్థులకు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుండి భారతీయులు సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 25-32 శాతం తగ్గించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.


కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులను, ఇతర ప్రతిభావంతులను ఆకర్షించడాని మొదటి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. నైపుణ్యం కలిగిన 1,000 మందికి పైగా నిపుణులను నియమించుకోవడానికి రూ. 106 కోట్లపైనే బడ్జెట్ లో కేటాయించింది. రాబోయే నెలల్లో H-1B వీసా హోల్డర్ల కోసం 'వేగవంతమైన మార్గం'ని ప్రారంభించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో యూఎస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ప్రతిభావంతులను కెనడా ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


కొత్త వలస ప్రణాళిక ప్రకారం.. కెనడా దేశంలోకి వచ్చే నివాసితుల సంఖ్యను తగ్గించి, అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రవేశాలను కొనసాగించాలని అక్కడ ప్రభుత్వం యోచిస్తోంది. 2026 నుండి 2028 వరకు సంవత్సరానికి 3, 80,000 మందికి శాశ్వత నివాసితుల సంఖ్యను తీసుకురావాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తొలుత 2026లో తాత్కాలిక నివాసితుల సంఖ్యను 3, 85,000కు, తదుపరి రెండు సంవత్సరాలకు 3,70,000కు తగ్గిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. మొత్తంగా హెచ్-1బి వీసా హోల్డర్లకు కెనడా మంచి అవకాశాన్ని కల్పిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్

control Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సాయం చైనా

Updated Date - Nov 06 , 2025 | 08:48 PM