Share News

Dog asks for help: ప్లీజ్.. నాకు హెల్ప్ చెయ్యండి.. వీధి కుక్క హాస్పిటల్‌కు వచ్చి ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:05 PM

సాధారణంగా జంతువులేవీ తమ బాధలను బయటకు చెప్పుకోలేవు. శారీరకంగా ఎంత కష్టం వచ్చినా, దెబ్బలు తగిలినా తమలో తామే బాధపడతాయి. నొప్పితో విలవిలలాడతాయి. చికిత్స తీసుకోవాలనే విషయమే వాటికి తెలియదు.

Dog asks for help: ప్లీజ్.. నాకు హెల్ప్ చెయ్యండి.. వీధి కుక్క హాస్పిటల్‌కు వచ్చి ఏం చేసిందో చూడండి..
stray dog video

సాధారణంగా జంతువులేవీ తమ బాధలను బయటకు చెప్పుకోలేవు. శారీరకంగా ఎంత కష్టం వచ్చినా, దెబ్బలు తగిలినా తమలో తామే బాధపడతాయి. నొప్పితో విలవిలలాడతాయి. చికిత్స తీసుకోవాలనే విషయమే వాటికి తెలియదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వీధి కుక్క మాత్రం నొప్పితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లింది. హాస్పిటల్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యం రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (stray dog video).


@awkwardgoogle అనే ఎక్స్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వెటర్నరీ హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర కొందరు కూర్చుని ఉన్నారు. అక్కడకు ఓ వీధి కుక్క కుంటుకుంటూ వచ్చింది. దాని కాలికి గాయమైంది. దీంతో ఆ కుక్క నేరుగా వెటర్నరీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అక్కడున్న వారి ముందు కూర్చుని గాయమైన తన కాలిని ముందుకు చాచి సహాయం కోసం అర్థించింది. అక్కడున్న వైద్యురాలు ఆ కుక్కను పరీక్షించి చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లారు (vet clinic moment).


ఈ ఘటన మొత్తం ఆ హాస్పిటల్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది (injured dog rescue). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 90 వేల మంది వీక్షించారు. 3.7 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుక్క చాలా తెలివైదని చాలా మంది కామెంట్లు చేశారు. కొందరు మనుషుల కంటే ఈ కుక్క ఎక్కువ తెలివి ప్రదర్శించిందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అడవి గేదెపై సింహం దాడి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


మీది డేగ చూపు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న స్పైడర్‌ను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 06 , 2025 | 06:05 PM