Cambodia Cyber Scam Arrests: కాంబోడియాలో సైబర్ మోసాలు..105 మంది భారతీయుల అరెస్టు
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:33 AM
కాంబోడియా కేంద్రంగా చైనా సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న కాల్ సెంటర్లపై అక్కడి పోలీసులు దాడులు జరిపారు.

138 ప్రాంతాల్లో కాంబోడియా పోలీసుల దాడులు
3,075 మంది అనుమానితుల పట్టివేత
న్యూఢిల్లీ, జూలై 24: కాంబోడియా కేంద్రంగా చైనా సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న కాల్ సెంటర్లపై అక్కడి పోలీసులు దాడులు జరిపారు. 15 రోజుల పాటు.. 138 ప్రాంతాల్లో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 3,075 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో 105 మంది భారతీయులున్నారు. నిజానికి భారతీయులను ఉద్యోగాల పేరుతో కాంబోడియా, మయన్మార్ వంటి దేశాలకు తీసుకెళ్తున్న చైనా సైబర్ కేటుగాళ్లు.. వారిని అక్కడ నిర్బంధిస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాల కాల్ సెంటర్లు నిర్వహించేలా చేస్తున్నారు. మాట వినకుంటే.. కరెంటు షాకులివ్వడం, తిండితిప్పలు లేకుండా చేస్తూ.. హింసిస్తున్నారు. దీనిపై భారత ప్రభుత్వం పలు దఫాలుగా కాంబోడియా ప్రభుత్వంతో చర్చించింది. ఈ క్రమంలో కాంబోడియా పోలీసులు ఈ దాడులు జరిపారు. అరెస్టయిన వారిలో భారతీయులతోపాటు.. వివిధ దేశాల పౌరులు ఉన్నారు. కాగా.. ఈ దాడుల్లో అరెస్టయిన 105 మంది భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News