Home » Cambodia
పురాతన శైవ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య మొదలైన యుద్ధం ముదురుతోంది..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం తీవ్ర హింస రూపం దాల్చింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాంబోడియా కేంద్రంగా చైనా సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న కాల్ సెంటర్లపై అక్కడి పోలీసులు దాడులు జరిపారు.
భారతీయ మహిళలకు బంగారం(Gold Rates) అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో కీలక నిందితుణ్ని సైబర్ సెక్యురిటీ పోలీసులు అరెస్టు చేశారు. చైనీయులతో చేతులు కలిపి భారతదేశానికి చెందిన నిరుద్యోగులను కంబోడియా పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తు్న్న అబ్దుల్ అలాంను ఢిల్లీలో పట్టుకున్నారు.
కాంబోడియా జైల్లో నెల రోజులు తాను బాతు గుడ్లు.. వట్టి చేపలు తిని బతికానని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మున్సిఫ్ ప్రకాశ్ చెప్పాడు. చేసిన పనికి డబ్బులివ్వకపోగా తానే బాకీ పడ్డానంటూ కంపెనీ తనపై కేసుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్ ప్రకాశ్‌కు ఆ చెర నుంచి విముక్తి లభించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో (Cambodia) చిక్కుకున్న భారతీయులను మన ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.