Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాల్పుల విరమణపై సంచలన ప్రకటన..
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:09 PM
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఈస్టర్ పండుగ నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇది ఎంత సమయం వరకు అమల్లో ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి (Russia Ukraine war) సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా 30 గంటలపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలని ఆయన ఆదేశించారు. పుతిన్ శనివారం (ఏప్రిల్ 19) సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ తాత్కాలిక యుద్ధ విరామం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రకటనను ఆయన రష్యా సైనిక ప్రధానాధికారి వాలెరీ గెరాసిమోవ్‌తో జరిగిన సమావేశం తర్వాత తెలిపారు.
ఉక్రెయిన్ మాత్రం..
ఈ సమయంలో అన్ని రకాల యుద్ధ చర్యలు ఆపాలని ఆదేశించారు. ఉక్రెయిన్ కూడా ఇదే విధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, శత్రువులు ఎలాంటి దాడి చేసినా లేదా ఉల్లంఘనలకు పాల్పడినా సైన్యం అప్రమత్తంగా ఉండాలని పుతిన్ సూచించారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా ఇటీవలే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొనసాగించే విషయంలో నిరాశ వ్యక్తం చేసింది. శుక్రవారం రోజున అమెరికా, తగిన పురోగతి కనిపించకపోతే శాంతి ప్రయత్నాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రష్యా క్రిస్మస్ సందర్భంగా తాత్కాలిక విరామం ప్రకటించింది.
అసలు యుద్ధం ఎప్పుడు మొదలైంది
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. ఆ రోజు రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్ మీదకు దాడికి పంపించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొంతకాలంగా సమస్యలు కొనసాగుతుండగా, 2022లో రష్యా ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది. దీంతో యుద్ధం మొదలైంది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అనేక మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అనేక నగరాలు కూడా ఇప్పటికే నాశనం అయ్యాయి. ఈ యుద్దం మొదలై ఇప్పటికే మూడేళ్ల దాటింది. కానీ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈస్టర్ పండుగ నేపథ్యంలో 30 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News