Youth Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కారణాలివే.. తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - May 04 , 2025 | 12:18 PM
Heart Attac Risks In Youth: ఆడుతూ పాడుతూ తిరిగే పసిపిల్లలు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఉత్సాహంతో ఉరకలేయాల్సిన యువ గుండెలు సడన్ గా ఆగిపోతున్నాయి. ఇలాంటి కేసులు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది. యువ హృదయాలకు ఏమవుతోంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలాగో తెలుసుకోండి.

Young People Sudden Heart Attacks: చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అన్ని వయసువారికీ ఇప్పుడు హార్ట్ ఎటాక్ వస్తోంది. కానీ, ఒక మంచి విషయం ఏంటంటే నివారణ మార్గం చేతుల్లోనే ఉంది. మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే గుండెపోటుకు కారణాలేంటో అర్థం చేసుకోవడం చాలా అవసరం. గత 15 సంవత్సరాలుగా గుండెపోటు కేసులు యువతలో పెరగడానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. 7 - 8 ప్రధాన కారణాలు ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. మరి, గుండెపోటుకు ముఖ్య కారణాలు, రక్షించుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాం.
గుండెపోటు నియంత్రించాలంటే ముందుగా జీవనశైలిలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ మార్పులను మీరే నియంత్రించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 50 శాతం పైగా యువత కొన్ని చెడు అలవాట్లు కామన్ గా అనుసరిస్తున్నారు. ఇందులో వ్యాయామానికి దూరంగా ఉండటం, తక్కువ శారీరక శ్రమ చేయడం. ఎక్కువ నడవకపోవడం, రోజంతా ఒకే చోట కూర్చోవడం, ధూమపానం, ఊబకాయం వంటివి. ఇవే గుండెపోటు లేదా గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణం. అధిక మొత్తంలో మద్యం సేవించేవారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. దీనితో పాటు, పెరిగిన ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం కూడా గుండె జబ్బులు వచ్చేందుకు మార్గం వేస్తున్నాయి.
గుండెపోటుకు ప్రధాన కారణాలు
కుటుంబంలో తండ్రి, తల్లి లేదా తోబుట్టువులకు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా కూడా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ అనేవి గుండెపోటుకు మూడు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ఈ అనారోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, ఈ మూడింటిని సులభంగా నియంత్రించవచ్చు. తద్వారా, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
గుండెపోటును ఎలా నివారించాలి?
మీ పాదాలకు పనిచెప్పారంటే గుండెపోటును నివారించడం చాలా సులభం. ఎలా అంటే క్రమం తప్పకుండా నడవడం, శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వ్యాయామం మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రించడంలో, ఊబకాయాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో ధూమపానం, అధికంగా మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను వదిలించుకోవడానికి మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఈ ప్రయోజనాలే కాదు. సాధారణ శారీరక శ్రమ మీ మందుల అవసరాన్ని సగానికి సగం తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతుంది.
Read Also: యోగర్ట్‌లో ప్రొటీన్ ఎంత..
Summer Drinks: లెమన్ జ్యూస్ చేస్తున్నారా.. వేసవిలో ఈ పొరపాట్లు చేస్తే రుచిలో తేడా..
Low BP Symptoms: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే లో బీపీ ఉన్నట్టే..