Foot Pain: తరచూ కాళ్లు, కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. అయితే, ఇదే కారణం కావచ్చు..
ABN , Publish Date - May 15 , 2025 | 07:25 AM
Foot Pain And Swelling Reasons: ఏ కారణం లేకుండానే కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా. పాదాల్లో వాపు ఇబ్బందిపెడుతోందా. అయితే, నిర్లక్ష్యం చేయకండి. ఈ సమస్యలకు ఇది సంకేతం కావచ్చు.

Nutrition and Foot Pain Connection: శరీరంలో ఏవైనా పోషకాలు, విటమిన్లు లోపిస్తే మన శరీరం ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా హెచ్చరికలు ఇస్తుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది తెలిసి కూడా చాలామంది చిన్న సమస్యను పెద్దది చేసుకుంటారు. ఉదాహరణకు తరచూ కాళ్లలో వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులు పెద్ద సమస్యలను సూచిస్తాయి. కాబట్టి, వెంటనే జాగ్రత్తపడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువగా నడవడం, గంటల తరబడి కూర్చోవడం, నిలబడటం లేదా గాయం వల్ల కూడా కాళ్ల నొప్పులు రావచ్చు. కానీ, కాళ్ళలో నొప్పి, వాపు, మంట, తిమ్మిర్లు కొనసాగితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్లే ఇలా జరుగుతుంది. కాలు తొడ భాగం నుంచి పాదాల వరకూ వివిధ రకాల నొప్పులు రావడానికి కారణం.. పోషకాల లోపమే. కాబట్టి, ఏ భాగంలో నొప్పి ఏ పోషకం తగ్గడం వల్ల వస్తుందో తెలుసుకోండి. పట్టించుకోకుండా ఉన్నారంటే మాత్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొక తప్పదు.
కాళ్ళలో నొప్పి
మీ పాదాలలో నొప్పి ఉంటే అది కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు.
తొడ తిమ్మిరి
తొడలో తిమ్మిరి రావడానికి కారణం ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం). శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని కూడా ఈ లక్షణం సూచిస్తుంది.
కాళ్ళలో మంట
విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ B12 లోపం వల్ల పాదాలలో మంట లేదా జలదరింపు అనుభూతి సంభవిస్తుంది.
కీళ్ల నొప్పి
కీళ్ల నొప్పుల సమస్య చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మోకాళ్లు, చీలమండలు, వేళ్లలో కీళ్ల నొప్పులు ఉన్నట్లయితే అది కూడా పోషకాల లోపానికి సంకేతం కావచ్చు. ఈ సమస్యలు విటమిన్ డి లోపించినా లేదా యూరిక్ యాసిడ్ పెరుగుదల వల్ల కూడా వస్తాయి.
కాళ్ళలో వాపు
పాదాల వాపును అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది కాలేయ ఒత్తిడి, మూత్రపిండాల పనిచేయకపోవడం లేదా గుండె సంబంధిత సమస్యల వల్ల సంభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి టెస్ట్ చేయించుకోండి.
Read Also: Sugar Foods: హెల్తీ ఫుడ్స్ పేరుతో రోజూ ఇవి తింటున్నారా.. షుగర్ ప్రమాదం రెట్టింపు..
Health Tips: హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..
Kidney Problem: వేసవిలో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా..