Share News

Morning Headaches: ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి వస్తోందా? ఈ వ్యాధి లక్షణం కావచ్చు.. జాగ్రత్త..!

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:18 AM

Waking Up With Headaches: సాధారణంగా హ్యాంగోవర్ కారణంగానే ఉదయం నిద్ర లేవగానే తలనొప్పిగా అనిపిస్తుంది. ఒకవేళ రాత్రి మద్యం సేవించకపోయినా నిద్ర మేల్కొన్నప్పటి నుంచి తలనొప్పి సమస్య వేధిస్తుంటే జాగ్రత్త. ఈ తలనొప్పి అనేక తీవ్రవ్యాధులు సంభవిస్తాయని చెప్పే లక్షణం కావచ్చు. ఇంతకీ, ఉదయం తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని నివారించడానికి ఏమి చేయాలి?

Morning Headaches: ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి వస్తోందా? ఈ వ్యాధి లక్షణం కావచ్చు.. జాగ్రత్త..!
Causes Of Morning Headaches

Causes Of Morning Headaches: చాలా సార్లు ఉదయం నిద్రలేచిన తర్వాత తేలికపాటి లేదా తీవ్రమైన తలనొప్పి రావచ్చు. ఇందుకు డీహైడ్రేషన్, నిద్రలేమి, శరీరంలో అంతర్లీనంగా ఉండే వ్యాధులు ఇలా అనేక రకాల కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే అది తీవ్రమైన సమస్యగా మారుతుంది. పొద్దున్నే మేల్కొగానే తలనొప్పి రావడం అనేక వ్యాధుల లక్షణం. కాబట్టి దీనిని తేలికగా తీసుకోకూడదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఏ వ్యాధుల లక్షణం? దానిని నివారించడానికి ఏమి చేయాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం.


చాలా మందికి తరచుగా ఉదయం మేల్కున్న తర్వాత తలంతా భారంగా ఉండటంతో పాటు తేలికపాటి లేదా తీవ్రమైన నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రాత్రిపూట ఎక్కువగా మద్యం సేవించడం వల్లే ఈ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా తింటే తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అయితే, హ్యాంగోవర్ కు నిమ్మకాయ నీరు లేదా ఐస్ క్రీం ఉత్తమ ఔషధం అని వైద్యులు అంటున్నారు. కానీ, కేవలం హ్యాంగోవర్ వల్లే ఉదయం తలనొప్పి వస్తుందని అనుకుంటే పొరపాటు. ఇదే కాకుండా, ఉదయం తలనొప్పికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.


తలనొప్పికి ఇవే కారణాలు

ఉదయం నిద్ర లేచినప్పుడు తలనొప్పిగా అనిపిస్తే, దానికి అత్యంత సాధారణ కారణం నిద్ర లేకపోవడం అని డాక్టర్లు అంటున్నారు. స్లీప్ అప్నియా కూడా దీనికి కారణం కావచ్చు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ వల్ల ఉదయం నిద్ర లేచినప్పుడు తలనొప్పి వస్తుంది. ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇదే కాకుండా డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు ఉదయం నిద్ర లేవగానే తలనొప్పిగా అనిపించవచ్చు. ఇంకా, పళ్లు నూరడం (బ్రక్సిజం) అంటే దంతాలు బిగించడం వల్ల దవడ కండరాలు ఒత్తిడికి గురై తలనొప్పి వస్తుంది. కెఫీన్ అలవాటు ఉన్నవారు దాన్ని తీసుకోవడం తగ్గించినా, సైనస్, కొన్ని ఇతర వ్యాధుల వల్ల కూడా ఇలా జరుగుతుంది.


ఇది చెక్ చేసుకోండి

ఉదయం నిద్ర లేవగానే తరచుగా తలనొప్పి వస్తుంటే మీరు కచ్చితంగా చెక్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్నిసార్లు శరీరంలోని ఏదైనా తీవ్రమైన వ్యాధులు ఉన్నాఇలా జరగవచ్చు. పదే పదే మార్నింగ్ తలనొప్పి వస్తుంటే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేసుకుని చికిత్స తీసుకోవాలి.


ఇవి కూడా చదవండి:

ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..

బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కొవిడ్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

Read Latest and Health News

Updated Date - Jun 01 , 2025 | 11:16 AM