Vitamin E: శరీరంలో విటమిన్ E లోపం ఎందుకొస్తుంది? గుర్తించేందుకు ముఖ్య సంకేతాలు ఇవే!
ABN , Publish Date - Jun 07 , 2025 | 07:48 PM
Vitamin E Deficiency: విటమిన్ E లోపం శరీరానికి ఎన్నో సమస్యలు కలిగిస్తుంది. ఈ లోపం ఎందుకు వస్తుంది? దాని లక్షణాలేమిటి? ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ Eను సహజంగా ఎలా పొందాలి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.

Symptoms Of Vitamin E Deficiency: మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ E ఒకటి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కణాల పరిరక్షణ, చర్మ ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మెరుగుపరచడంలో విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీర కండరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా సహాయపడుతుంది. విటమిన్ ఇ సహజంగా అనేక ఆహార పదార్థాలలో కనిపిస్తుంది. అయినా ఈ విటమిన్ కొరత వల్ల ఎక్కువమందిలో కనిపిస్తుంది. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని గుర్తించేందుకు ముఖ్య సంకేతాలు ఇవే..
విటమిన్ E లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. విటమిన్ E అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం అత్యంత సాధారణ కారణం. దీనితో పాటు దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్,సెలియాక్ వ్యాధి వంటి కొన్ని వ్యాధులు విటమిన్ E ని గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. శిశువులలో ఈ లోపం అకాల పుట్టుక వల్ల సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ కొవ్వు ఉండే ఆహారం కూడా ఈ లోపానికి కారణమవుతుంది, ఎందుకంటే విటమిన్ E కొవ్వులో కరుగుతుంది. తగినంత కొవ్వు ఉన్నప్పుడు మాత్రమే శరీరంలో సరిగ్గా పనిచేస్తుంది.
విటమిన్ E లోపం లక్షణాలు ఏమిటి?
విటమిన్ ఇ లోపం లక్షణాలు ఒకేసారి బయటపడవు. క్రమక్రమంగా శరీరం సాధారణ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ లోపం ముఖ్యంగా కండరాలు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
శరీర కండరాలలో బలం లేకపోవడం వల్ల కండరాల బలహీనత ఉండవచ్చు.
ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం లేదా శక్తి తక్కువగా ఉండటం.
నడుస్తున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు అస్థిరంగా అనిపించడం.
అస్పష్టమైన దృష్టి లేదా బలహీనమైన దృష్టి.
చర్మం పొడిగా, నిర్జీవంగా మారడం. త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనిపించడం.
శరీరం సులభంగా ఇన్ఫెక్షన్లకు లోనవుతుంది. రోగనిరోధకశక్తి తగ్గడమే ఇందుకు కారణం.
శారీరక, మానసిక అభివృద్ధి ప్రభావితం కావచ్చు. ముఖ్యంగా పిల్లలలో పెరుగుదల మందగిస్తుంది.
విటమిన్ E సహజ వనరులు
బాదం, వాల్నట్, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు,
సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్
అవకాడో
పాలకూర, ముల్లంగి ఆకులు, ఇతర ఆకుకూరలు
గుడ్డు, పిండిపదార్థాలు
విటమిన్ ఇ లోపం రాకూడదంటే?
తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని నివారించండి.
ముఖ్యంగా మీకు ఏదైనా జీర్ణ వ్యాధి ఉంటే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.
మీ వైద్యుడు సూచించిన విధంగా సప్లిమెంట్లను తీసుకోండి.
పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వారే ఈ విటమిన్ లోపానికి ఎక్కువగా గురవుతారు.
Also Read:
మహిళలు ఈ ముగ్గురికి దూరంగా ఉండాలి..
అందరూ ఉన్నా.. అనాథలుగానే మిగిలిపోతున్నారు..
For More Health News