Share News

Women Health: ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..

ABN , Publish Date - May 30 , 2025 | 02:20 PM

Health Screenings For Women: మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. ఈ అజాగ్రత్త దీర్ఘకాలంలో వారిని అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. రొటీన్ హెల్త్ చెకప్స్ చేయించుకోని కారణంగా ప్రాణాంతక పరిస్థితులు ఎదుర్కొవాల్సి రావచ్చు. కాబట్టి, ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఈ 8 ఆరోగ్య పరీక్షలు తరచూ చేయించుకుంటూ ఉండాలి.

Women Health: ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..
Essential Routine Health Checkups For Women

Essential Health Checkups For Women: భారతదేశంలో నివసించే చాలామంది మహిళలు ఆరోగ్య సంరక్షణ విషయంలో అజాగ్రత్తగా ఉంటుంటారు. అలసట, నీరసం, నిద్ర విషయంలో సరైన శ్రద్ధ తీసుకోరు. అవగాహన ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం మహిళల్లో ఇలాంటి ధోరణే కనిపిస్తుంటుంది. అప్పటికవి చిన్న విషయాలుగానే కనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పరిస్థితి చేయిదాటిపోయే వరకూ రాకూడదంటే క్రమం తప్పకుండా మహిళలు డాక్టర్ దగ్గరకు ఆరోగ్య స్థితి గురించి కొన్ని సాధారణ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కింది 8 రొటీన్ చెకప్స్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించకూడదు.


రొమ్ము ఆరోగ్యం

భారతీయ మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణం రొమ్ము క్యాన్సర్. 40-49 సంవత్సరాల మధ్య వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. మహిళలు గనక ఏడాదికి ఒకసారి రొమ్ము పరీక్షలు, మామోగ్రామ్‌లతో పాటు, కొన్ని ఇతర పరీక్షలూ చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

గర్భాశయ క్యాన్సర్

గర్భాశయ క్యాన్సర్ ఒక తీవ్రమైన సమస్య. మహిళలు 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి పాప్ స్మియర్‌ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ప్రధానగా HPV పరీక్షతో సహా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వాటిని చేయించుకోవాలి. 11-12 సంవత్సరాల వయస్సులోనే టీకాలు వేయించుకుంటే గర్భాశయ క్యాన్సర్, ఇతర క్యాన్సర్‌ల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


థైరాయిడ్ పనితీరు

మహిళలకు ఎక్కువగా థైరాయిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. థైరాయిడ్ పనితీరు పరీక్షలు (T3, T4, TSH) ముఖ్యమైనవి. సాధారణ చెకప్ కోసం వెళ్లే స్త్రీలల్లో అధికమంది థైరాయిడ్ సంబంధిత సమస్య గురించే డాక్టర్ ను సంప్రదిస్తున్నారు. గర్భిణీలు లేదా పీసీఓడీ సమస్యలు, మెనోపాజ్ దశలో అడుగుపెట్టిన మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

డయాబెటిస్ స్క్రీనింగ్

డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్నవయసులోనే యువత ఈ దీర్ఘకాలిక వ్యాధికి బలవుతున్నారు. కాబట్టి, రక్తంలో చక్కెర లేదా HbA1c లెవెల్స్ క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారు. మహిళలు.


హృదయనాళ ఆరోగ్యం

భారతదేశంలో మహిళల్లో మరణానికి, వైకల్యానికి హృదయనాళ వ్యాధులే ప్రధాన కారణం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ మెయింటెయిన్ చేయాలి. ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ ప్రకారం 20 సంవత్సరాలు లేదా అంతకు ముందు నుంచే ప్రారంభించాలి.

రక్త హీనత

మహిళల్లో రక్తహీనత చాలా సాధారణం. ఇది కొన్నిసార్లు అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించే వరకు బయటపడదు. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) పరీక్ష అనేది త్వరిత, సులభమైన స్క్రీనింగ్ పరీక్ష. ఋతుస్రావం లేదా గర్భిణీ స్త్రీలు, ఎటువంటి కారణం లేకుండా అలసటగా అనిపించే మహిళలకు ఇది కీలకమైన స్క్రీనింగ్ పరీక్ష.


విటమిన్ లోపాలు

విటమిన్ డి, బి12 లోపం సర్వసాధారణం. మహిళల్లో విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, అలసట లేదా మానసిక స్థితిలో మార్పులు ఉన్న స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

ఎముకల ఆరోగ్యం

మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ మహిళలను మరింత ఆందోళనపరుస్తోంది. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు లేదా అంతకుముందే బోన్ మినరల్ డెన్సిటీ (BMD) టెస్ట్ చేయించుకుంటే మంచిది.


అలాగే ఉదర, పెల్విక్ సోనోగ్రఫీ అండాశయ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా ఉంటే అసాధారణ గర్భాశయ రక్తస్రావం, PCOS నిర్వహణ, రుతుక్రమం ఆగిపోయిన తర్వాత రక్తస్రావం, సంతానోత్పత్తి సమస్యల గురించి గైనకాలజిస్ట్‌తో చర్చించేందుకు ప్రాధాన్యతనివ్వాలి.


ఇవి కూడా చదవండి:

బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి

రాత్రిళ్లు 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే

Read Latest and Health News

Updated Date - May 30 , 2025 | 02:45 PM