Share News

Vitamin D: ఉదయాన్నే ఈ పని చేస్తే.. విటమిన్ D లోపం ఎప్పటికీ రాదు..

ABN , Publish Date - Apr 22 , 2025 | 10:03 AM

Vitamin D Sources: ఉదయం నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేయడం అలవాటు చేసుకుంటే చాలు. విటమిన్ డి స్థాయులు సహజంగా వాటంతట అవే పెరిగిపోతాయి. మీ అనారోగ్యాలన్నీ తొలగిపోయి దృఢంగా, ఫిట్ గా తయారవుతాయి. అలా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Vitamin D: ఉదయాన్నే ఈ పని చేస్తే.. విటమిన్ D లోపం ఎప్పటికీ రాదు..
Natural Tips To Prevent Vitamin D Deficiency

Natural Tips To Prevent Vitamin D Deficiency: భారతదేశంలో ఒకప్పుడు ప్రజలు ఒక్కో రుతువులో ఒక్కో రకమైన ఆహారాలు తీసుకునేవారు. కానీ, నేటి యువతరం ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డారు. ఈ మార్పుల కారణంగా మన దేశంలో సూర్యకాంతి పుష్కలంగా ఉన్నా ప్రస్తుతం నూటికి తొంభై మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అలసట, నిరాశ, మానసిక ఒత్తిడి ఇప్పటి తరంలో పెరిగిపోవడానికి ఇదే కారణం. సూర్యకాంతిలో తక్కువ సమయం గడపడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉండవు. కానీ, ఈ చిన్న అలవాటు విటమిన్ డి లోపాన్ని మీ దగ్గరకు కూడా రానీయదు. అదేంటో తెలుసుకుందాం.


ఉదయాన్నే ఈ పని చేస్తే..

ఉదయం వేళల్లో ఈ సాధారణ అలవాటు శరీరంలో విటమిన్ డి స్థాయిలను సహజంగా పెంచుతుంది. ఉదయపు సూర్యకాంతి ఎముకలను బలోపేతం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి ఉదయం తెలవారే సమయంలో అరగంట సేపు ఎండలో కూర్చోండి. ఇలా చేయడం వల్ల శరీరం సూర్యరశ్మికి గురై సొంతంగా విటమిన్ డి ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. రోజూ కేవలం అరగంట సేపు సూర్యరశ్మి తీసుకుంటే చాలు. జీవితాంతం విటమిన్ డి మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, చర్మానికి సూర్యరశ్మి నేరుగా తగలలాంటే తేలికగా, వదులుగా ఉన్న దుస్తులు ధరించడం ముఖ్యం.


రోజులో ఏ సమయం ఎంచుకుంటే మంచిది?

పగలు సూర్యుడి ఉన్నంతసేపు విటమిన్ డి శరీరానికి అందుతుందని ఎండలో కూర్చొంటే అది చాలా పొరపాటు. సాధారణంగా వేకువ జామున సూర్యుడి నుంచి వచ్చే కిరణాలే విటమిన్ డి ఉత్పత్తికి అనుకూలం. కానీ, వేసవిలో ఉదయం 8 గంటవరకూ, శీతాకాలంలో ఉదయం 9 గంటల వరకూ ఎండలో ఉండవచ్చు. ఈ సమయం దాటితే వచ్చే సూర్య కిరణాలు శరీరానికి చాలా హానికరం.


విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి?

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి రోజువారీ డైట్ లో పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, గుడ్లు, నారింజ వంటి ఆహార పదార్థాలు చేర్చుకోవాలి. వీటిలో చాలావరకూ మొక్కల ఆధారిత ఆహారాలే. ఈ పదార్థాలు తరచూ తింటే విటమిన్ డి సప్లిమెంట్లతో ఎప్పటికీ పనుండదు.


Read Also: Popcorn Lung Disease: పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధి గురించి విన్నారా.. వీరికే ఎక్కువగా వచ్చే ఛాన్స్..

Constipation: ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..

Health Tips: ఈ పండ్లు తిన్నాక నీరు తాగితే.. కడుపులో ఏ సమస్యలు వస్తాయో తెలుసా..

Updated Date - Apr 22 , 2025 | 10:04 AM