Real VS Fake Mangoes: జాగ్రత్త.. కల్తీ మామిడి పండ్లను ఇలా గుర్తించండి..
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:42 PM
మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే, ఆ పండ్లు మంచివా లేదా కల్తీ పండ్ల అని గుర్తించడం చాలా కష్టం. కాబట్టి, కల్తీ మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సమ్మర్ అంటేనే అందరికి గుర్తొచ్చే పండు మామిడి. దీనిని పండ్లలో రారాజు అని అంటారు. ఇది తినడానికి చాలా తియ్యగా ఉంటుంది. అయితే, కొన్ని పండ్లు పుల్లగా కూడా ఉంటాయి. చాలా మంది పుల్లగా ఉన్న మామిడి కాయలతో కారం చేసుకుని తింటారు. ఈ మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరు ఎంతో ఇష్టంతో తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ మామిడి పండ్లు చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. అయితే, బాగా కనిపించే పండ్లు అన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే, చాలా వరకు కల్తీ పండ్లను విక్రయిస్తున్నారు. కాబట్టి, ఈ సింపుల్ టిప్స్‌తో కల్తీ మామిడి పండ్లను గుర్తించండి..
కల్తీ మామిడి పండ్లను గుర్తించడం ఎలా..
రంగును తనిఖీ చేయండి: కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు కొద్దిగా మెరుస్తూ కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్ల కంటే పసుపు లేదా నారింజ రంగులో ఎక్కువగా కనిపిస్తాయి.
వాసన చూడండి: కృత్రిమంగా పండించిన మామిడికాయలు కొన్ని రసాయనాలు లేదా వేరే వాసన కలిగి ఉంటాయి.
బరువును తనిఖీ చేయండి: కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు సహజంగా పండిన వాటితో పోలిస్తే మృదువుగా లేదా మెత్తగా అనిపించవచ్చు.
మచ్చలు: మామిడి పండ్లకు రసాయనాల ఇంజెక్షన్ వల్ల మచ్చలు కనిపిస్తాయి. వాటిని తినవద్దు. సహజ మామిడి పండ్లలో మచ్చలు ఉండే అవకాశం తక్కువ.
రుచిని తనిఖీ చేయండి: నిపుణుల అభిప్రాయం ప్రకారం, కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు రుచిగా లేదా వింతగా ఉండవచ్చు. మామిడి రుచి చెడుగా ఉంటే లేదా అసహ్యకరమైన రుచిని కలిగి ఉంటే, దానిని కృత్రిమంగా పండించి ఉండవచ్చు.
నీటిలో ముంచి పరీక్షించండి: మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో ఉంచండి. మామిడి పండ్లు నీటిలో మునిగిపోతే అవి సహజంగా పండినవి, అవి తేలుతుంటే కృత్రిమంగా పండించినవి.
బేకింగ్ సోడా వాడండి: నీటిలో కొంచెం బేకింగ్ సోడా వేసి, మామిడి పండ్లను ఆ మిశ్రమంలో 15-20 నిమిషాలు ఉంచండి. నానబెట్టిన తర్వాత, మీరు మామిడి పండ్లను కడిగినప్పుడు మామిడి పండ్ల రంగు మారితే అవి రసాయనాలతో పండించి ఉండవచ్చు.
Also Read:
TTD Clarity: టీటీడీలో సిఫార్సు లెటర్స్ రద్దు విషయంపై క్లారిటీ..
WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..