Hibiscus Plant Benefits: మందార మొక్క.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం.!
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:34 PM
అందంగా కనిపించే ఈ మొక్క మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ముఖం మీద ముడతలు తగ్గించడమే కాదు, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు మందార మంచి పరిష్కారం.

ఇంటర్నెట్ డెస్క్: ఆయుర్వేదంలో మందారను ముఖ్యమైన ఔషధ మొక్కగా గుర్తించారు. దీని ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అనేక రకాల వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. అందంగా కనిపించే ఈ పువ్వు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ముఖం మీద ముడతలు తగ్గించడమే కాదు, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు మందార మంచి పరిష్కారం.
చర్మ సమస్యలు:
చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటి సమస్యలున్నవారు ఉదయం, సాయంత్రం 2–3 మందార పువ్వులు తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని శుభ్రపరచి ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తున్నారు. ఋతుస్రావ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు.. మందార ఆకుల రసం ఉదయం, సాయంత్రం తాగితే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
జుట్టు సమస్యలు:
చుండ్రు ఉన్నవారు మందార ఆకుల రసం తలపై రాస్తే చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. జుట్టు రాలే వారు లేదా బట్టతల బాధితులు మందార పువ్వులను నువ్వుల నూనెలో వేసి నెమ్మదిగా మరిగించి, ఆ నూనెను రాత్రి తలపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
మధుమేహం:
డయాబెటిస్ ఉన్నవారు మందార ఆకుల రసం తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుందని, ఉదయం, సాయంత్రం ఆకు రసం అరగ్లాసు నీటితో కలిపి తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
కాలేయ ఆరోగ్యం
మందార పువ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. మందార పువ్వులలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.మందార పువ్వులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వివిధ రూపాల్లో
మందార పువ్వును ఆయుర్వేదంలో వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు. మందార పువ్వుల నుండి టీ తయారుచేసి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మందార పువ్వుల నూనెను జుట్టు, చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. మందార పువ్వుల పొడిని ఆహారంలో కలుపుకొని తినవచ్చు లేదా ఇతర ఔషధాల తయారీలో ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు:
మందారను వాడే ముందు శుభ్రంగా కడగాలి.
రసాలు తీసుకునేటప్పుడు పరిమితి పాటించాలి.
మీరు గర్భవతిగా ఉన్నా లేదా తీవ్రమైన వ్యాధులు ఉన్నా, వాడకానికి ముందు డాక్టర్‌ను సంప్రదించండి.
మనకు దగ్గరలోనే ఉన్న ఈ సాధారణ మొక్కలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దాన్ని సరైన రీతిలో వాడితే ఆరోగ్యంగా ఉండటం ఖాయం!
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే కిడ్నీ సమస్యలు..!
హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.
Also Read Health News