Vitamin B12: విటమిన్ B12 గురించి 99 శాతం మందికి తెలియని వాస్తవాలు.. తెలియకుంటే నష్టపోతారు..
ABN , Publish Date - May 19 , 2025 | 01:54 PM
Vitamin B12 Facts Vs Myths: శరీరానికి అత్యంత కీలకమైన విటమిన్ బి12 గురించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. కొన్ని అవాస్తవ ప్రచారాలను నిజమని నమ్మి చాలామంది చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. విటమిన్ బి 12 గురించి మీరు నిజమని నమ్మే ఈ కింది విషయాలు అస్సలు నిజం కావు.

Common Myths about Vitamin B12: ఈ రోజుల్లో ఆరోగ్యం సంరక్షణ, ఆహారం గురించి సోషల్ మీడియా ద్వారా అనేక రకాల విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సమాచారం కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నారు. ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్సను ఫాలో అవుతున్నారు. అయితే, మీరు వినే వాటిలో కొన్ని నిజమే అయి ఉండవచ్చు. కానీ, కొన్ని మాత్రం కచ్చితంగా పుకార్లే. అలాగే విటమిన్ బి12 గురించి కూడా ఎన్నో అవాస్తవాలను నిజమని నమ్ముతున్నారు చాలామంది. మీరూ విటమిన్ బి12 బాధితులైతే ఈ అపోహల్లోని నిజానిజాలేంటో తెలుసుకోండి.
శాకాహారులు
శాకాహారుల్లో మాత్రమే విటమిన్ బి12 లోపం ఉంటుంది అందరూ తరచూ అనడం వినే ఉంటారు. కానీ ఇది పూర్తిగా సరైనది కాదు. విటమిన్ బి12 ప్రధానంగా పాలు, పెరుగు, గుడ్డు, మాంసం మొదలైన పదార్థాల నుంచి లభ్యమవుతుంది. పాల సంబంధిత ఆహారపదార్థాలకు దూరంగా ఉండేవారు అంటే వీగన్స్ ఈ లోపంతో బాధపడే అవకాశం ఉంది. కానీ శాకాహారులు అందరూ కాదు. కొన్నిసార్లు ఈ లోపం మాంసాహారులలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వారి జీర్ణవ్యవస్థ ఈ విటమిన్‌ను సరిగ్గా గ్రహించలేకపోతే.
ఆకుపచ్చని కూరగాయలు
చాలా మంది విటమిన్ బి12 ఆకుపచ్చ కూరగాయలలో కూడా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ. ఆకుపచ్చ కూరగాయలు కచ్చితంగా విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. కానీ వాటిలో విటమిన్ B12 ఉండదు. ఈ విటమిన్ జంతు ఆధారిత ఉత్పత్తులు లేదా బలవర్థకమైన (విటమిన్లు జోడించిన) ఆహారాలలో మాత్రమే కనిపిస్తుంది.
సప్లిమెంట్లు
విటమిన్ మాత్రలు లేదా ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వైద్యుల సలహా మేరకు తీసుకుంటే విటమిన్ బి12 సప్లిమెంట్లు చాలా సురక్షితం. B12 నీటిలో కరిగే విటమిన్. అంటే శరీరం తనకు అవసరమైనంత గ్రహిస్తుంది. మిగిలినది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.
అలసట
అలసట, బలహీనత లేదా తలతిరుగుడు లాంటి సమస్యలు ఉంటే విటమిన్ బి12 లోపం ఉన్నట్టేనని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే బి12 లోపం నాడీ వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉంటే నిరాశ, జ్ఞాపకశక్తి కోల్పోవడం, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి సమస్యలు వస్తాయి.
పిల్లలకు అవసరం లేదు
ఇది కూడా చాలా పెద్ద అపార్థం. పిల్లల ఎదుగుదల, మెదడు అభివృద్ధికి విటమిన్ బి 12 తప్పనిసరిగా అందాలి. చెప్పాలంటే పెద్దలకు ఎంత అవసరమో పిల్లలకు ఈ విటమిన్ అంతే అవసరం. శిశువులలో దీని లోపం వల్ల పెరుగుదల మందగించడం, మానసిక అభివృద్ధి ఆగిపోవడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం జరుగుతుంది.
విటమిన్ బి 12 లోపాన్ని ఎలా అధిగమించాలి?
మీరు శాకాహారులైతే మీ ఆహారంలో B12 అధికంగా ఉండే ఫోర్టిఫైడ్ ఆహారాలు (ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, సోయా పాలు మొదలైనవి) చేర్చుకోండి.
ఎప్పటికప్పుడు రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా మీ విటమిన్ స్థాయిలను తనిఖీ చేసుకోండి.
వైద్యుడిని సంప్రదించకుండా సప్లిమెంట్లు తీసుకోకండి. లోపం ఉంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.
మీ జీర్ణక్రియను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే B12 లోపం తరచుగా శరీరం B12 గ్రహించుకోకపోవడం వల్లే వస్తుంది.
Read Also: Blood Pressure: రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే ఇలా చేయండి..
Constipation: మలబద్ధకం ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది.. లక్షణాలేంటి..
Gut Health: తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..