Diabetes: మధుమేహ బాధితులకు నేత్రపరీక్ష తప్పనిసరి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:36 PM
అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి అన్నారు.
- అగర్వాల్ ఐ హాస్పిటల్ రీజనల్ హెడ్ డాక్టర్ సౌందరి
చెన్నై: అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి(Doctor Soundari) అన్నారు. ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా శుక్రవారం ఉదయం ఆస్పత్రి ఆధ్వర్యంలో డయాబెటిక్ రెటినోపతి సదస్సు నిర్వహించారు. చెన్నై, బెంగళూరు, ముంబాయి, కొల్‌కత్తా, హైదరాబాద్, చండీఘడ్, శ్రీనగర్(Hyderabad, Chandigarh, Srinagar), త్రివేండ్రం నగరాల్లో ఈ సదస్సు ఒకే సమయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరంలోని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్‌లో మధుమేహ బాధితులకు ఈ నెల 30 వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ సౌందరి తెలిపారు. తక్కినవారికి కన్సల్టేషన్ ఫీజులో 50శాతం రాయతీ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు 95949 24048 అనే నెంబర్‌కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె వివరించారు. ఆ హాస్పిటల్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్ సదస్సులో ప్రసంగించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News