Climbing Stairs: మెట్లు ఎక్కిన తర్వాత ఊపిరి ఆడటం లేదా? ఇది ఈ ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు..
ABN , Publish Date - May 29 , 2025 | 09:13 AM
Climbing Stairs Tired: మెట్లు ఎక్కిన తర్వాత అలసట రావడం చాలా సాధారణ విషయం. కానీ, శ్వాస ఆడకపోవడం వంటి సమస్య తలెత్తుతుంటే అది ఈ కింది తీవ్ర అనారోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు.

Breathless After Climbing Stairs: మెట్లు ఎక్కిన తర్వాత అలసట, ఆయాసం రావడం సహజం. వృద్ధులు, తరచూ శారీరక శ్రమకు దూరంగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, కొన్ని మెట్లు ఎక్కగానే ఊపిరి ఆడనట్లుగా ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపిస్తుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే, ఈ లక్షణం కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి, ఇకపై ఊపిరి ఆడకపోవడం అనే విషయాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకండి.
రక్తహీనత
శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడురక్తహీనత వస్తుంది. సరళంగా చెప్పాలంటే హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి ఇతర శరీర భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది. ముఖ్యంగా కష్టపడి పనిచేసేటప్పుడు శరీర కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందదు. అందుకే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారిలో చర్మం పసుపు రంగులోకి మారడం, బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, ఇది రక్తహీనతకు సంకేతం కావచ్చని నిర్ధారించుకోండి.
గుండె జబ్బులు
స్వల్ప సమయం మెట్లు ఎక్కినప్పటికీ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది వస్తుంటే అది గుండె జబ్బుకు సంకేతం కావచ్చు. వయస్సు పెరిగే కొద్దీ గుండె శరీరానికి తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు తల తిరగడం, కాళ్ళ వాపు లేదా ఛాతీ నొప్పి వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి.కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లేదా ఇతర గుండె సమస్యలను సూచిస్తుంది.
ఊపిరితిత్తులు
ఊపిరితిత్తుల పని మన శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడం. ఊపిరితిత్తుల సమస్య ఉంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ILD), క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ (COPD) వంటి వ్యాధులు ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. మీరు దగ్గు, గురక లేదా ఛాతీలో అసౌకర్యాన్ని కూడా అనుభవిస్తే వెంటనే జాగ్రత్తగా ఉండండి.
ఒత్తిడి, ఆందోళన
శ్వాస ఆడకపోవడం అనేది అప్పుడప్పుడు ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా వస్తుంది. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో ఎక్కువ అడ్రినలిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శ్వాసక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి తగినంతగా శ్వాస తీసుకోవడం లేదని భావిస్తారు.
అధిక బరువు
మీరు అధిక బరువుతో ఉన్నప్పుడు మీ శరీరం దాని విధులన్నింటినీ నిర్వహించడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. డయాఫ్రాగమ్, ఊపిరితిత్తులు అధిక కొవ్వు వల్ల ఒత్తిడికి గురవుతాయి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తక్కువ శారీరక శ్రమ చేసినా కూడా ఊబకాయం కారణంగా గుండె ఎక్కువగా పనిచేయవలసి వస్తుంది. తద్వారా శ్వాస ఆడకపోవడం జరుగుతుంది.
Also Read:
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే ఏం జరుగుతుంది..
For More Telugu News