UBI Recruitment: యూనియన్ బ్యాంక్‌లో 2000లకు పైగా నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీ పొడిగింపు..ఇదే చివరి అవకాశం..
ABN , Publish Date - Mar 10 , 2025 | 08:24 PM
UBI Recruitment 2025: డిగ్రీ పూర్తిచేసిన వారికోసం యూనియన్ బ్యాంక్ ఇటీవల అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా అభ్యర్థుల కోసం దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది. మీరు ఇప్పటివరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోకపోతే యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వీలైనంత త్వరగా నమోదు చేసుకోవచ్చు.

Union Bank Apprentice Recruitment 2025 : డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నియామకాలకు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీని పొడిగించింది. కొత్త తేదీ ప్రకారం ఇప్పుడు మీరు మార్చి 12,2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ unionbankofindia.co.in ని సందర్శించి వెంటనే ఫారమ్‌ను త్వరగా సమర్పించండి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీని మార్చి 12, 2025 వరకు పొడిగించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ unionbankofindia.co.in ని సందర్శించి డైరెక్ట్ అప్లికేషన్ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
అర్హత
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నియామక డ్రైవ్ కింద మొత్తం 2691 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి.
అభ్యర్థులు 1 ఏప్రిల్ 2021న లేదా ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉత్తీర్ణత ధృవీకరణ పత్రం తప్పనిసరి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు ఫిబ్రవరి 1, 2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము
యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుము కేటగిరీ ప్రకారం నిర్ణయించబడింది. జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రుసుము రూ. 800 + జీఎస్టీ, ఎస్సీ/ఎస్టీ మరియు అన్ని మహిళా అభ్యర్థులకు రుసుము రూ. 600 + జీఎస్టీ. PwBD (దివ్యాంగ్) కేటగిరీ అభ్యర్థులు రూ. 400 + GST చెల్లించాలి. రుసుమును ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇలా దరఖాస్తు చేసుకోండి
ముందుగా మీరు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (unionbankofindia.co.in)కి వెళ్లండి.
హోమ్ పేజీలో "కెరీర్" లింక్‌పై క్లిక్ చేయండి.
న్యూ పేజీకి వెళ్లి అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం లింక్‌ను ఎంచుకోండి.
తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు మీ ఖాతాలోకి లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా పూరించండి.
నిర్దేశించిన దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
సబ్మిట్ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను తప్పక డౌన్‌లోడ్ చేసుకోండి. దీని ప్రింట్ కాపీని తీసి ఉంచుకోండి.
Railway Jobs : టెన్త్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..
NCC Police Jobs: డిగ్రీ అర్హతతో..భారత సైన్యంలో లెఫ్టినెంట్ అయ్యే అవకాశం..
మరిన్ని చదువు, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..